Movie News

భయపెట్టేసిన ‘వకీల్ సాబ్’

తెలుగు సినిమాల దేశీయ మార్కెట్ కొవిడ్ దెబ్బ నుంచి మ‌ధ్య‌లో బాగానే కోలుకుంది. గ‌త కొన్ని నెల‌ల్లో కొన్ని సినిమాలు ఇర‌గాడేశాయి. చివ‌ర‌గా వ‌చ్చిన భారీ చిత్రం వ‌కీల్ సాబ్ సైతం తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌ట్టింది. కానీ యుఎస్‌లో మాత్రం మిగ‌తా సినిమాల్లాగే తెలుగు చిత్రాల మార్కెట్ పుంజుకోవ‌డంలో ఇబ్బందులు త‌ప్ప‌లేదు.

ఐతే గ‌త నెల‌లో వ‌చ్చిన జాతిర‌త్నాలు సినిమా యుఎస్‌లో అంచ‌నాల్ని మించి ఆడేసింది. ఏకంగా మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్బులోకి అడుగు పెట్టి ఔరా అనిపించింది. దీంతో ఇక అక్క‌డ మార్కెట్ కూడా పూర్వ‌పు స్థితికి చేరుకున్న‌ట్లే అని.. ఇక పెద్ద సినిమాల‌కు అక్క‌డ ఢోకా లేన‌ట్లే అని అనుకున్నారు. జాతిర‌త్నాలు సినిమాకే అలా ఉంటే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్‌కు ఇంకెంత‌గా యుఎస్ తెలుగు ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌డతారో అనుకున్నారు.

పాజిటివ్ టాక్ వ‌స్తే వ‌కీల్ సాబ్ ఈజీగా 1.5-2 మిలియ‌న్ డాల‌ర్ల మ‌ధ్య వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంచ‌నా వేశారు. తీరా చూస్తే అక్క‌డ ఈ చిత్రం అండ‌ర్ పెర్ఫామ్ చేసింది. తొలి వీకెండ్లో 6 ల‌క్ష‌ల డాల‌ర్లు క‌లెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత పెద్ద‌గా ముందుకు క‌ద‌ల్లేదు. ఫుల్ ర‌న్ వ‌సూళ్లు 7.5 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను దాటేలా లేవు. అక్క‌డా ఆల్మోస్ట్ సినిమా ర‌న్ అయిపోయిన‌ట్లే. జాతిర‌త్నాలుతో మార్కెట్ పుంజుకుంద‌ని భావించి వ‌కీల్ సాబ్ స‌హా పెద్ద సినిమాల‌కు మంచి రేట్లు ఇవ్వ‌డానికి ముందుకొచ్చారు బ‌య్య‌ర్లు. కొన్ని సినిమాల‌కు డీల్స్ కూడా అయ్యాయి.

కానీ వ‌కీల్ సాబ్ బ్రేక్ ఈవెన్‌కు దాదాపు హాఫ్ మిలియ‌న్ ద‌గ్గ‌ర ఆగిపోయి బ‌య్య‌ర్ల‌ను న‌ష్టాల పాలు చేయ‌డంతో త‌ర్వాతి సినిమాల విష‌యంలో భ‌యం మొద‌లైంది. అందులోనూ మ‌ళ్లీ క‌రోనా భ‌యం పెరుగుతుండ‌టంతో యుఎస్ మార్కెట్ పూర్వ‌పు స్థాయిని అందుకోవ‌డం కాదు క‌దా.. మ‌ళ్లీ తిరోగ‌మ‌న బాట ప‌డుతుంద‌నే భ‌యం బ‌య్య‌ర్ల‌లో పుడుతోంది.

This post was last modified on April 19, 2021 6:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

1 hour ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

2 hours ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

2 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

2 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

3 hours ago

ట్రంప్ కేబినెట్ నిండా బిలియనీర్లే

అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…

4 hours ago