సినిమాలు చేసినా చేయకపోయినా సమంత ఎప్పుడూ వార్తల్లో వ్యక్తే. మునుపటితో పోలిస్తే ఆమె సినిమాలు తగ్గించేసినా సోషల్ మీడియాలో ఆమె పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. కెరీర్లో కొంచెం పేరు సంపాదించినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎంతోమందికి తోడ్పాటు అందించిన సామ్.. ఇప్పుడు మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డికి చెందిన కవిత అనే మహిళ గురించి సమంత తెలుసుకుంది. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. అయితే భర్త రోజు తాగొచ్చి కొట్టడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. తన వల్ల కుటుంబానికి భారం కాకూడదని భావించి మొదట ఆమె వ్యవసాయం చేసింది. ఆమెకు ఏడుగురు తోబుట్టువులున్నారు. వాళ్లందరినీ తల్లిదండ్రులతో కలిసి పోషిస్తుండగా.. తల్లి, తండ్రి ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు.
ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కష్టమై, కుటుంబాన్ని నడపడానికి ఆటో నడపడం మొదలుపెట్టింది కవిత. మియాపూర్ నుంచి బాచూపల్లి వరకు ఆటోను నడుపుతూ ఆమె కుటుంబానికి అండగా నిలిచింది. ఓ ప్రోగ్రాం ద్వారా కవిత గురించి తెలుసుకున్న సమంత.. ఆమెకు ఏదైనా సహాయం చేయాలని భావించింది. రూ.12.50 లక్షల ఖరీరైన స్విఫ్ట్ కారును కొని కవితకు అందజేసింది. దీంతో కవిత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సమంతపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on April 18, 2021 7:03 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…