Movie News

జాతిరత్నాలు చూసి తమిళ క్రికెటర్ ఫిదా


కరోనా విరామం తర్వాత తెలుగులో అతి పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ ఒకటి. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి కామెడీ స్టార్లు నటించిన సినిమా రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టడం అనూహ్యమే. చూడ్డానికి ఇది మామూలుగా సినిమానే. కథా కథనాల్లో పెద్దగా లాజిక్ ఉండదు. చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఐతేనేం ప్రేక్షకులకు ఆ సిల్లీనెస్‌లో ఉన్న ఫన్ బాగా నచ్చింది. సినిమా ఇరగాడేసింది. రెండు మూడు వారాల పాటు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది ‘జాతిరత్నాలు’. ఇప్పుడీ సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయగా.. థియేటర్లలో చూడని వాళ్లందరూ ఓ లుక్కేస్తున్నారు.

ఐతే థియేటర్లలో రిలీజైనపుడు వచ్చిన టాక్ చూసి భారీ అంచనాలతో చూసిన కొందరు.. ఓటీటీలో సినిమా చూసి కొంత పెదవి విరుస్తున్న మాట వాస్తవమే. అదే సమయంలో ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తూ దానిపై ప్రశంసలు కురిపిస్తున్న వాళ్లూ ఉన్నారు.

‘జాతిరత్నాలు’ చూసి ఫిదా అయిపోయిన టీమ్ ఇండియా క్రికెటర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టడం విశేషం. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తీక్. జాతిరత్నాలు సినిమా కడుపు చెక్కలయ్యేలా నవ్వించిందని.. ప్రతి సన్నివేశంలోనూ తాను నవ్వుతూనే ఉన్నానని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. డైలాగులు అదిరిపోయాయని.. డైరెక్షన్ అద్భుతమని.. నటీనటులు ప్రతి ఒక్కరూ బాగా చేశారని దినేశ్ కితాబిచ్చాడు. కామెడీ జానర్ అన్నింటికంటే కష్టమైందని.. కానీ దాన్ని ‘జాతిరత్నాలు’ అద్భుతంగా పండించిందని కార్తీక్ అన్నాడు. చివరగా ‘ఔట్ స్టాండింగ్’ అనే కామెంట్‌తో తన ట్వీట్ రివ్యూను ముగించాడు కార్తీక్.

డైలాగ్స్, నేటివిటీ మీద ఆధారపడ్డ ఓ తెలుగు సినిమా ఓ తమిళ క్రికెటర్‌కు మన సినిమా ఇంతగా నచ్చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐతే కార్తీక్‌కు తెలుగు బాగానే వచ్చన్నది సన్నిహితుల మాట. గత ఐపీఎల్ సీజన్లో ఓ మ్యాచ్ సందర్భంగా తెలుగు అంపైర్ సంషుద్దీన్‌తో తెలుగులోనే అతను మాట్లాడటం గమనార్హం.

This post was last modified on April 16, 2021 8:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago