రెండు నెలల కిందట ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్‌లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకుంది మలయాళ సినిమా ‘దృశ్యం-2’. ఆరేళ్ల కిందట వచ్చిన ‘దృశ్యం’కు ఇది సీక్వెల్. ఈ సినిమా మొదలైనపుడు ‘దృశ్యం’ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం లాగానే కనిపించింది చాలామందికి. ఎందుకంటే ‘దృశ్యం’ విడుదలైన ఆరేళ్ల తర్వాత సీక్వెల్ అనడం.. రెండు నెలల్లో సినిమాను పూర్తి చేసేయడం.. థియేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఓటీటీలో రిలీజ్ చేయడంతో ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేకపోయాయి.
కానీ పెద్ద హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమా చూసి.. జనాలు ఆశ్చర్యపోయారు. ద్వితీయార్ధంలో ట్విస్టులకు షాకైపోయారు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గని విధంగా థ్రిల్ ఇవ్వడంతో చూసిన వాళ్లందరూ ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయి సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఐతే మలయాళ వెర్షన్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను తెలుగులో కూడా తీసి ఉంటే బాగుండేదే అనిపించింది. ఆల్రెడీ మలయాళ వెర్షన్ ఓటీటీలో ఉన్న నేపథ్యంలో తెలుగులో ఈ సినిమా తీయరేమో అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్.. మన వెంకీతో కలిసి ‘దృశ్యం-2’ను రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. సురేష్ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగడంతో శరవేగంగా ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. స్క్రిప్టుపై మంచి పట్టు ఉండటంతో షూటింగ్‌లోనూ ఆలస్యం చేయలేదు జీతు.
మలయాళ వెర్షన్ కంటే తక్కువ వ్యవధిలో, కేవలం నెల రోజుల్లో ‘దృశ్యం-2’ తెలుగు వెర్షన్ పూర్తయిపోవడం విశేషం. సినిమాను ముగించిన సందర్భంగా ప్రధాన తారాగణం అయిన మీనా, కృతిక జయకుమార్, ఎస్తేర్ అనిల్.. దర్శకుడు జీతు జోసెఫ్‌తో కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు వెంకీ. ఎంత రీమేక్ అయితే మాత్రం ఇంత స్పీడుగా సినిమా అయిపోయిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. వెంకీ కెరీర్లోనే అతి తక్కువ రోజుల్లో పూర్తయిన సినిమాగా ‘దృశ్యం-2’ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.
This post was last modified on April 15, 2021 4:09 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…