కరోనా భయం పోయి.. టాలీవుడ్ బాక్సాఫీస్ రీస్టార్ట్ అయి.. ఆశావహ పరిస్థితులు కనిపించగానే టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించడానికి ఎలా పోటీ పడ్డారో తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా కొన్ని రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో కొత్త సినిమాల విడుదల తేదీలు ప్రకటించారు. ఏకంగా ఏడాది తర్వాతి రావాల్సిన సినిమాలకు కూడా ఇప్పుడే డేట్లు ఇచ్చేయడం విశేషం. అప్పటికి నిజంగా సినిమాలు రిలీజ్ చేస్తామో లేదో.. ముందైతే డేట్లు ఇచ్చేద్దాం అన్నట్లుగా పోటీ పడ్డారు.
కట్ చేస్తే ఇప్పుడు చాలా సినిమాలు అనుకున్న డేటుకు రావడం కష్టంగానే ఉంది. షూటింగ్ ఆలస్యానికి తోడు.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు చాలా సినిమాలు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వారం నుంచి ఒక్కో సినిమా వాయిదా పడటం మొదలైంది.
ఇప్పటికే లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాటపర్వం ఒకదాని తర్వాత ఒకటి వాయిదా నిర్ణయాన్ని ప్రకటించాయి. మున్ముందు మరిన్ని సినిమాలు ఇదే బాట పట్టనున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌కు భయపడుతున్నారా లేక ఏపీలో టికెట్ల రేట్ల నియంత్రణ నేపథ్యంలో ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేయడం మంచిది కాదనుకుంటున్నారా తెలియదు కానీ.. ఈ నెలలో రావాల్సిన మూడు క్రేజీ సినిమాలు వాయిదా పడిపోయాయి. వచ్చే నెలలో రావాల్సిన ఆచార్య, నారప్ప సినిమాలు కూడా షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కావడం సందేహంగానే ఉంది.
ఐతే ఈ సినిమాలన్నీ డేట్లు మార్చుకుని వెనక్కి వెళ్లడంతో.. తర్వాతి రోజులకు షెడ్యూల్ అయిన సినిమాలతో క్లాష్ తప్పేలా లేదు. ఆ సినిమాలు అనుకున్న ప్రకారం సిద్ధం అయితే ఇప్పుడు ఏం చేస్తారన్నది ప్రశ్న. ముఖ్యంగా జూన్ నెలలో రిలీజ్ డేట్ల కోసం కొట్లాట తప్పేలా లేదు. మొత్తానికి మున్ముందు టాలీవుడ్లో గందరగోళ పరిస్థితులు తప్పేలా లేవు.
This post was last modified on April 15, 2021 7:16 am
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…