అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు రెండేళ్ల కిందట ‘ఐకాన్’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాకు క్యాప్షన్‌గా ‘కనబడుట లేదు’ అని పెట్టారు. అది ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ.. నిజంగానే ‘ఐకాన్’ కనిపించకుండా పోయాడు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఈ సినిమానే చేస్తాడని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ.. దాన్ని పక్కన పెట్టి ‘అల వైకుంఠపురములో’ను లైన్లో పెట్టేశాడతను.
ఆ సినిమా అయ్యాకైనా ‘ఐకాన్’ తెరపైకి వస్తుందనుకుంటే అదీ జరగలేదు. ‘పుష్ప’ ముందుకొచ్చింది. దీని తర్వాత కొరటాల శివ సినిమా.. ఆపై ప్రశాంత్ నీల్ చిత్రం.. ఇలా ఒక్కొక్కటి లైన్లోకి వచ్చాయే తప్ప ‘ఐకాన్’ సంగతి ఎటూ తేలలేదు. బన్నీ తనకు వీలు చిక్కినపుడు కచ్చితంగా ఈ సినిమా చేస్తాడని బన్నీ వాసు చెప్పడం తెలిసిందే. కానీ అలా ఎప్పుడు వీలు చిక్కుతుందన్నదే అర్థం కాకుండా ఉంది.
ఐతే ఇప్పుడు ‘ఐకాన్’కు లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తుండటం విశేషం. ‘పుష్ప’ విడుదల తర్వాత బన్నీ.. కొరటాల శివ చిత్రం చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ సరిగ్గా ఆ సినిమా చేయాల్సిన టైంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను తీసుకొచ్చాడు కొరటాల. బన్నీతో సంప్రదింపులు జరిపాకే ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది.
తారక్ సినిమా అయ్యాక బన్నీతో కొరటాల జట్టు కట్టొచ్చేమో. కానీ ‘పుష్ప’ అయ్యాక బన్నీ ఏం చేస్తాడన్నదే అర్థం కావడం లేదు. అతడితో పని చేయడానికి ఏ అగ్ర దర్శకుడూ ఖాళీగా లేడు. ఈ నేపథ్యంలో తనకు నచ్చిన కథే అయిన ‘ఐకాన్’ను బన్నీ సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు. పైగా ‘వకీల్ సాబ్’ సినిమాతో వేణు శ్రీరామ్ తన సత్తా చూపించాడు. స్టార్ హీరోను బాగానే డీల్ చేయగలనని చాటుకున్నాడు. కాబట్టి అతడి మీద బన్నీకి ఇప్పుడు బాగానే గురి కుదిరి ఉండొచ్చు. దిల్ రాజు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే త్వరలోనే ‘ఐకాన్’ పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
This post was last modified on April 14, 2021 9:08 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…