సౌత్ ఇండియాలో శరవేగంగా సినిమాలు చేసుకుపోయే స్టార్ హీరోల్లో మోహన్ లాల్ ఒకరు. మలయాళ సినీ పరిశ్రమలో చాలా ఏళ్ల నుంచి ఆయనే నంబర్ వన్ హీరో. కానీ వేరే ఇండస్ట్రీల అగ్ర కథానాయకుల్లా ఆయన ఏడాదికో సినిమాకు పరిమితం కారు. సినిమాల ఎంపికలో తాత్సారం చేయరు. చాలా వేగంగా స్క్రిప్టు ఓకే చేస్తుంటారు. షూటింగ్ కూడా పెద్దగా హడావుడి లేకుండా చకచకా కానిచ్చేస్తుంటారు. కానీ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడరు.
ఈ మధ్యే ‘దృశ్యం-2’తో మెస్మరైజ్ చేశాడు లాలెట్టన్. ఇక లాల్ కెరీర్లో అతి పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన ‘మరక్కార్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి విడుదలకు ముందే జాతీయ అవార్డు సైతం దక్కింది. ఇటీవలే తన స్వీయ దర్శకత్వంలో ‘బరోజ్’ అనే భారీ చిత్రాన్ని కూడా లాల్ మొదలుపెట్టాడు. అది పట్టాలెక్కడానికి ముందే ఆయన సైలెంటుగా ఓ సినిమాను మొదలుపెట్టి.. తక్కువ వ్యవధిలో ముగించేశాడు. ఆ సినిమానే.. ఆరట్టు.
ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరట్టు’ పూర్తి స్థాయి మాస్ మసాలా సినిమాలా కనిపిస్తోంది. ఈ రోజే దీని టీజర్ రిలీజైంది. పంచెకట్టులో ఊర మాస్‌గా కనిపించాడు మోహన్ లాల్. టీజర్లో కొత్తదనం అయితే ఏమీ లేదు. మన దగ్గర స్టార్ హీరోలను ఎలివేట్ చేస్తూ తీసే మాస్ మసాలా సినిమాలాగే కనిపించింది. టీజర్ మొత్తం ఎలివేషన్లే ఉన్నాయి. కథ గురించి ఏమీ హింట్ ఇవ్వలేదు.
ఐతే ఈ టీజర్లో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించే అంశం ఒకటుంది. టీజర్లో ఉన్న ఏకైక డైలాగ్.. తెలుగులో ఉండటం విశేషం. ‘‘నేను వాడిని చంపేస్తాను’’ అంటూ మలయాళం కలగలిసిన తెలుగులో మోహన్ లాల్ డైలాగ్ చెప్పడం విశేషం. మలయాళ సినిమాలో ఇలా తెలుగు డైలాగ్ ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో ఏదో ‘తెలుగు’ కనెక్షన్ ఉందని ఈ డైలాగ్‌ను బట్టి అర్థమవుతోంది. బహుశా విలన్ని తెలుగువాడిగా ఏమైనా చూపిస్తుండొచ్చు. లేదంటే తెలుగు ప్రాంతం నేపథ్యంలో సినిమా నడవొచ్చు. ట్రైలర్ చూస్తే దీనిపై స్పష్టత రావచ్చేమో.
This post was last modified on April 14, 2021 3:02 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…