టాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కరోనా విరామం తర్వాత వచ్చిన అత్యంత భారీ చిత్రాల్లో వకీల్ సాబ్ ఒకటి. లాక్ డౌన్ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా మాస్టర్ మినహాయిస్తే ఏ పెద్ద హీరో సినిమా ఇండియాలో రిలీజ్ కాలేదు. ఆ సినిమా డివైడ్ టాక్‌ను కూడా తట్టుకుని మంచి వసూళ్లే సాధించింది. ప్రేక్షకులు మంచి ఆకలితో ఉన్నపుడు విడుదల కావడం ఆ చిత్రానికి కలిసొచ్చింది.
తెలుగులో ఆ స్థాయి భారీ చిత్రం లాక్ డౌన్ తర్వాత రిలీజ్ కాలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ లోటును తీర్చింది. పైగా పవన్ కళ్యాణ్‌కు ఇది రీఎంట్రీ మూవీ కూడా కావడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. గత శుక్రవారం మంచి హైప్ మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందా అని సందేహించారు.
కానీ తొలి వారాంతంలో ఫ్యాన్స్ వకీల్ సాబ్ సినిమాను మోస్తే.. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తమ చేతుల్లోకి తీసుకున్నట్లే కనిపిస్తోంది. కేవలం అభిమానుల హంగామాతో సినిమాలు నడిచిపోవు. వాళ్ల సందడంతే వీకెండ్‌కే పరిమితం. ఆ తర్వాత సినిమా నడవాలంటే ఫ్యామిలీస్ చూడాలి. వకీల్ సాబ్‌కు ఈ విషయంలో ఢోకా లేకపోయింది. మహిళల సమస్యలు, వారి మనోభావాల నేపథ్యంలో అర్థవంతమైన చర్చ జరిగిన సినిమా ఇది. దీంతో లేడీ ఆడియన్స్, అలాగే ఫ్యామిలీస్‌కు ఈ సినిమా నచ్చుతోంది. మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అవుతుండటంతో కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు వస్తున్నారు.
ఉగాది రోజు ఈ ట్రెండ్ బాగా కనిపించిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. థియేటర్ల ముందు జనాల హంగామాకు సంబంధించి అభిమానులు షేర్ చేస్తున్న ఫొటోల్లో లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనిపిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఈ వారమంతా వకీల్ సాబ్‌కు ఢోకా లేనట్లే.
This post was last modified on April 14, 2021 12:16 pm
తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన…
ఏపీలో కూటమి సర్కారుకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకవైపు ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందుకు సాగు తున్న సర్కారుకు.. ఇప్పుడు…
గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వెళ్లి వస్తున్న క్రమంలో హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై…
విడుదల ఇంకో నాలుగు రోజుల్లో ఉందనగా తమిళ గేమ్ ఛేంజర్ కు కొత్త సమస్యలు వస్తున్నట్టు చెన్నై అప్డేట్. ఇండియన్…
కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ…
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన…