లాక్ డౌన్ విరామం తర్వాత థియేటర్లు జనాలతో వెల్లువెత్తేలా చేసిన సినిమా ‘వకీల్ సాబ్’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. పవన్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ‘వకీల్ సాబ్’. వీక్ డేస్‌లో కూడా సినిమా స్టడీగానే సాగేలా కనిపిస్తోంది. ఐతే ఉన్నట్లుండి ‘వకీల్ సాబ్’ గురించి ఒక రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాను ఈ నెల 23నే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారన్నదే ఆ ప్రచారం.
‘వకీల్ సాబ్’ డిజిటల్ హక్కులను అమేజాన్ ప్రైమ్ వాళ్లు సొంతం చేసుకున్న మాట వాస్తవం. డిజిటల్ పార్ట్‌నర్ అమేజాన్ ప్రైమ్ అంటూ సినిమా టైటిల్స్‌కు ముందే పడుతుంది కూడా. ఐతే ఇంత భారీ చిత్రాన్ని విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి తెచ్చేస్తారన్న ప్రచారం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తుండటంతో చిత్ర నిర్మాణ సంస్థ అలెర్ట్ అయింది.
రూమర్లు నమ్మొద్దని.. ‘వకీల్ సాబ్’ ప్రస్తుతానికి థియేటర్లలో మాత్రమే ఆడుతుందని.. సమీప భవిష్యత్తులో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కాదని స్పష్టం చేస్తూ ఒక పోస్టర్ వదిలింది శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్.
ఇంతకుముందు ‘చావు కబురు చల్లగా’ సినిమా విషయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుందన్నారు. రిలీజ్‌కు ముందే ఈ ప్రచారం జరగడంతో కొంత డ్యామేజ్ కూడా జరిగింది. దీనిపై మేకర్స్ వెంటనే అప్రమత్తమై ఖండన ఇచ్చారు. దాని మీద చిన్న వివాదం కూడా నడిచింది. పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారంటూ నిర్మాత బన్నీ వాసు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ గురించి కూడా ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం థియేటర్లలో విడుదలైన నెల రోజులకు అమేజాన్ ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
This post was last modified on April 12, 2021 10:14 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…