అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్‌కు అస్సలు కాలం కలిసి రావట్లేదు. హీరోగా అరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు దాటినా అతను స్టార్‌గా ఎదగలేకపోయాడు. కొన్నేళ్లుగా పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి టైంలో ఓ విభిన్నమైన కథ మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. షేర్ మార్కెట్లో భారీ స్కామ్ చేసి 90వ దశకంలో సంచలనాలకు తెర తీసిన హర్షద్ మెహతా కథతో తెరకెక్కిన బిగ్ బుల్ తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ఆశించాడు. ఈ సినిమా కోసం అభిషేక్ చాలా కష్టపడ్డాడు. కానీ ఇదే కథతో వేరే వెబ్ సిరీస్ తెరకెక్కడం దీనికి ప్రతికూలమైంది. ‘స్కామ్ 1992’ పేరుతో హన్సల్ మెహతా.. హర్షద్ మెహతా కథను అద్భుత రీతిలో తెరకెక్కించాడు. కొన్ని నెలల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఆ సిరీస్ సంచలనాలు రేపింది. ఇండియన్ వెబ్ సిరీస్‌ల చరిత్రలోనే ది బెస్ట్ అనిపించుకుంది.
ఆ సిరీస్ అంతటి ఆదరణ తెచ్చుకుంటుందని జూనియర్ బచ్చన్ అండ్ కో ఊహించలేదు. దానికి వచ్చిన స్పందన ‘బిగ్ బుల్’కు తలనొప్పిగా మారింది. సినిమా ఎఫ్పుడో రెడీ అయినా.. వెంటనే రిలీజ్ చేస్తే ‘స్కామ్ 1992’ ప్రభావం పడుతుందని ఆపారు. ఇలా ఆగి ఆగి ఈ నెల 8న హాట్ స్టార్‌లో రిలీజ్ చేశారు. కానీ స్కామ్ 1992తో పోల్చి చూసి ఈ సినిమా పట్ల పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.
అసలు ఆల్రెడీ చూసిన కథే కదా అని బిగ్ బుల్ పట్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తే కనిపించట్లేదు. ఇక చూసిన వాళ్లయితే ఈ సినిమా పట్ల ఏమాత్రం సానుకూలంగా స్పందించట్లేదు. స్కామ్ 1992 స్థాయిలో ఏమాత్రం లేదని.. దాంతో పోలిక పక్కన పెట్టినా బిగ్ బుల్ అంతగా ఆకట్టుకునే సినిమా కాదని అంటున్నారు. అభిషేక్ బాగానే చేసినా.. స్కామ్ 1992లో ప్రతీక్ గాంధీ ముందు తేలిపోయాడని, ఈ సినిమా వల్ల అతడికెలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. ఓటీటీలో రిలీజైనప్పటికీ అభిషేక్ కెరీర్లో దీన్ని మరో ఫ్లాప్‌గానే పేర్కొంటున్నారు.
This post was last modified on April 12, 2021 8:17 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…