బాలీవుడ్ నటి దియా మీర్జా తల్లి కాబోతున్న విషయం ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. తాను గర్భంతో ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఐతే ఆమె బేబీ బంప్ చూస్తే నాలుగైదు నెలల గర్భంతో ఉన్నట్లు అనిపించింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో దియా పెళ్లి జరిగింది ఫిబ్రవరిలోనే. ఇంతలోనే నాలుగైదు నెలల గర్భంతో ఆమె కనిపించడంతో పెళ్లికి ముందే గర్భవతి అయిందని అర్థమైంది.
ప్రెగ్నెన్సీ రావడం వల్లే ఆమె హడావుడిగా, మరీ సింపుల్‌గా పెళ్లి చేసుకుందనే అభిప్రాయం జనాల్లో కలిగింది. ఐతే ఒక నెటిజన్ తాజాగా దీని గురించి దియాను సోషల్ మీడియాిలో ప్రశ్నించారు. ఆధునిక మహిళ అయిన దియా.. పెళ్లికి ముందే తాను గర్భవతిని అని ఎందుకు ప్రకటించలేకపోయిందని.. పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలని, లేదా ఆ విషయం వెల్లడించాలనే సంప్రదాయ ధోరణిలో ఎందుకు ఆలోచించారు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలపై దియా స్పందించింది. గర్భవతిని అయ్యాను కాబట్టి తాను హడావుడిగా పెళ్లి చేసుకున్నాననే అభిప్రాయం తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని అయ్యాను కాబట్టి హడావుడిగా పెళ్లి చేసుకోలేదు. ప్రెగ్నెన్సీ గురించి పెళ్లికి ముందే ప్రకటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. ప్రెగ్నెన్సీ విషయంలో అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్నదానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కాబట్టి ముందే ఈ విషయం బయటపడలేదు. అంతా బాగుందనుకున్నాక అందరికీ చెబుదాం అనుకున్నాం. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఏ ఆందోళనా లేకుండా నేనెంతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని వెల్లడించాను’’ దియా పేర్కొంది. తెలుగులో ఇటీవలే విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో దియా నాగార్జున భార్యగా నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 6, 2021 6:09 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…