కొద్ది నెలల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖుడికి చెందిన హోటల్లో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడి చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఉదంతం కొద్దిరోజులుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూరు మహానగరంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీలో నిషేధిత డ్రగ్స్ ను వినియోగించటం.. అందుకు బాధ్యులైన కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు.. టాలీవుడ్ నటులు కూడా దీనికి హాజరైన సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
తెలంగాణకు చెందిన ముగ్గురు.. నలుగురు ఎమ్మెల్యేలు ఈ పార్టీకి హాజరు కాగా.. ఒకరిద్దరు డ్రగ్స్ వినియోగించినట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ వాటిని అధికారికంగా ఖరారు చేయటం లేదు. ఇదిలా ఉంటే.. ఈ పార్టీకి టాలీవుడ్ నటులు కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఒక నటుడ్ని అక్కడి పోలీసులు రెండు రోజులు విచారించారు. అతడితో పాటు మరికొందరిని కూడా విచారించారు. ఈ సందర్భంగా వారు కొన్ని సంచలన నిజాల్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
సదరు పార్టీలో ఇరానీ అమ్మాయిలతో కలిసి మూడు రోజుల పాటు ఎంజాయ్ చేసిన మాట నిజమేనని టాలీవుడ్ కు చెందిన ఒక నటుడు విచారణలో వెల్లడించినట్లుగా చెబుతున్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో చిక్కుకున్న కొందరు అఫ్రూవర్స్ గా మారి కీలక సమాచారాన్ని బయటపెట్టటంతో సినీ.. రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వస్తున్నట్లుగా చెప్పాలి. అయితే.. ఈ పార్టీకి హాజరైన తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల వివరాల్ని అధికారికంగా వెల్లడించేందుకు బెంగళూరు ఇష్టపడటం లేదు.
విచారణ సాగుతుందని.. వివరాల్ని పూర్తిగా సేకరించిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని.. ఇప్పుడు కానీ పేర్లు బయటపెడితే.. మరికొందరు తప్పించుకునే వీలుందని.. అందుకే విచారణ పూర్తి అయ్యే వరకు వివరాలు వెల్లడించలేమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లోనూ.. టాలీవుడ్ లోనూ ఈ డ్రగ్ పార్టీ కలకలం రేపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on April 6, 2021 9:53 am
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్‌లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…