సిినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్. ‘రంగస్థలం’లో నాన్ బాహుబలి హిట్ కొట్టాక ‘వినయ విధేయ రామ’ లాంటి పేలవమైన సినిమా చేయడం పెద్ద తప్పు అని అర్థం చేసుకున్న అతను.. దీని తర్వాత మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ‘బాహుబలి’ దీటుగా పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధించి తనకు తిరుగులేని ఇమేజ్ తెచ్చి పెడుతుందని.. ప్రభాస్ లాగా తాను కూడా పాన్ ఇండియా స్టార్ అవుతానని అతను ధీమాగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో పెరిగే తన స్థాయికి తగ్గట్లుగానే కొత్త ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. సౌత్ ఇండియాలో రాజమౌళి కంటే ముందు తిరుగులేని స్థాయిని అందుకున్న శంకర్‌తో చరణ్ తన తర్వాతి సినిమాను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమానే. ఇదే తరహాలో మరో ఆసక్తికర చిత్రాన్ని అతను ప్లాన్ చేసుకున్నాడు.
‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఇది ఏడాది ముందు నుంచే చర్చల్లో ఉంది. ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు అయినట్లు సమాచారం. అతి త్వరలోనే అనౌన్స్‌మెంట్ కూడా రానుందట. ఉగాదికి ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. ‘జెర్సీ’ హిందీ వెర్షన్‌ను కూడా గౌతమే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యాక గౌతమ్ పేరు బాలీవుడ్లోనూ మార్మోగుతుందని భావిస్తున్నారు.
ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపే సంపాదిస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఆటోమేటిగ్గా దానికి పాన్ ఇండియా స్టేటస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. గౌతమ్ శైలిలో కొత్తగా ఉంటూనే చరణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on April 5, 2021 6:29 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…