Movie News

సాయిప‌ల్ల‌వి మీద ఎంత న‌మ్మ‌క‌మో..


తెలుగు సినిమాల్లో కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో న‌టించిన‌ సినిమాలో అయినా హీరోయిన్ డామినేష‌న్ అన్న‌ది అరుదుగా జ‌రుగుతుంటుంది. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల్లో మాత్ర‌మే ఇలాంటివి చూస్తుంటాం. ఫిదా సినిమాలో వ‌రుణ్ తేజ్‌ను మించి సాయిప‌ల్ల‌వి హైలైట్ అయిన సంగ‌తి తెలిసిందే. దాని త‌ర్వాత శేఖ‌ర్ తీసిన ల‌వ్ స్టోరి విష‌యంలోనూ ఇదే జ‌రిగేలా ఉంది. ఇప్ప‌టిదాకా రిలీజ్ చేసిన ప్ర‌తి ప్రోమోలోనూ సాయిప‌ల్ల‌వి డామినేష‌న్ చూశాం. ఈ సినిమాకు చైతూ కంటే కూడా సాయిప‌ల్ల‌వినే అట్రాక్ష‌న్ అంటే అతిశ‌యోక్తి కాదు.

ఇలా ఆమెకు ప్రాధాన్యం ద‌క్కేందుకు అంగీక‌రించిన చైతూను కూడా అభినందించాల్సిందే. కేవ‌లం సాయిప‌ల్ల‌విని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాబోతున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఆమెకున్న‌ క్రేజును ఇత‌ర భాష‌ల్లోనూ ఉప‌యోగించుకోవ‌డానికి నిర్మాత‌లు మంచి ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నాయి.

పెద్ద హీరోలు న‌టించిన భారీ సినిమాలు మిన‌హాయిస్తే.. తెలుగు చిత్రాలు ఒకేసారి ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ కావ‌డం అరుదు. అలా రిలీజ్ చేసినా నామ‌మాత్రంగానే ఉంటుంది. అయితే ల‌వ్ స్టోరి లాంటి మీడియం బ‌డ్జెట్లో తెర‌కెక్కిన‌ ఒక ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఈ నెల 16న‌ ఒకేసారి తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఒకేసారి విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది మ‌ల‌యాళఃలోనే కాగా.. ద‌క్షిణాదిన అంత‌టా ఆమెకు క్రేజ్ ఉంది.

ల‌వ్ స్టోరి మంచి విష‌యం ఉన్న సినిమాలా క‌నిపిస్తుండ‌టంతో ఇత‌ర భాష‌ల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌ల‌కు కాన్ఫిడెన్స్ వ‌చ్చిన‌ట్లుంది. సాయిప‌ల్ల‌వి కోసం ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కులూ సినిమా చూస్తార‌ని భావిస్తున్నారు. సారంగ ద‌రియా పాట‌కు భాష‌తో సంబంధం లేకుండా ఆద‌ర‌ణ ద‌క్కుతుండ‌టం కూడా ఈ ప్ర‌య‌త్నానికి పురిగొల్పి ఉండొచ్చు. ఐతే త‌మిళంలో కూడా సాయిప‌ల్ల‌వికి మంచి క్రేజే ఉండ‌గా.. ఆ భాష‌లో ల‌వ్ స్టోరిని ఎందుకు రిలీజ్ చేయ‌ట్లేదో మ‌రి?

This post was last modified on April 3, 2021 6:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

1 hour ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

2 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

2 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

3 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

6 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

7 hours ago