బాహుబలి, సాహో లాంటి చిత్రాలది పాన్ ఇండియా రేంజ్. ఇక బాలీవుడ్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. అలాంటి సినిమాల ట్రైలర్లు కొన్ని రోజుల వ్యవధిలో నెలకొల్పిన రికార్డులను కేవలం తెలుగులో మాత్రమే రిలీజవుతున్న ఒక సినిమా కొన్ని గంటల వ్యవధిలో బద్దలు కొట్టేయడం అనూహ్యమైన విషయమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ ఈ ఘనత సాధించింది.
ఒక్క రోజు వ్యవధిలో 15 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్.. మిలియన్‌కు పైగా లైక్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకుముందున్న ఆల్ టైమ్ రికార్డులన్నింటినీ భారీ తేడాతో ‘వకీల్ సాబ్’ ట్రైలర్ బద్దలు కొట్టేసింది. ఏదో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన భారీ సినిమా ట్రైలర్‌కు ఇలాంటి వ్యూస్, లైక్స్ వచ్చాయంటే ఏమో అనుకోవచ్చు. కానీ వకీల్ సాబ్ లాంటి రీమేక్ మూవీ ఇలాంటి రికార్డులు అసాధారణం.
వ్యూస్ పరంగా చూసినా.. లైక్స్ విషయంలోనైనా ఇండియన్ సినిమాల్లో అన్ని ‘ఫాస్టెస్ట్’ రికార్డులనూ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ బద్దలు కొట్టేసింది. వ్యూస్‌ను మించి ఈ ట్రైలర్‌కు వచ్చిన లైక్స్ ఆశ్చర్యం కలిగించేవి. ఇప్పటిదాకా ఒక్క రోజు వ్యవధిలో ఏ సినిమా ట్రైలర్‌కూ 5 లక్షల లైక్స్ కూడా రాలేదు. అలాంటిది ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌కు 24 గంటల వ్యవధిలో 10 లక్షలకు పైగా లైక్స్ పడటం చిన్న విషయం కాదు.
యూట్యూబ్‌లో ఒక లైక్ కొట్టాలంటే కచ్చితంగా ఈమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. అలాంటి లైక్స్ 10 లక్షలకు పైగా ఒక రోజు వ్యవధిలో వచ్చాయంటే పవన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పవన్ అభిమానులు ఎంతో పట్టుదలతో, కసితో యూట్యూబ్ రికార్డుల అంతు చూసినట్లు అర్థమవుతోంది. ఎంత పవన్ మూడేళ్ల గ్యాప్ తీసుకుంటే మాత్రం అభిమానులు ఇంత వెర్రెత్తిపోయి ఉన్నారా అనిపిస్తోంది టీజర్ రికార్డులు చూస్తుంటే.
This post was last modified on March 31, 2021 8:14 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…