టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు ఈ రోజు. అతడి జన్మదిన వేడుకలు నిన్న అర్ధరాత్రే మొదలయ్యాయి. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల మధ్య అతను పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ వ్యక్తుల్లో గాయని సునీత, ఆమె భర్త రామ్ ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
ఇంతకుముందెన్నడూ నితిన్ ఆప్త మిత్రుల్లో ఒకరిగా సునీత కనిపించలేదు. ఇప్పుడు నితిన్ పుట్టిన రోజు వేడుకల్లో సునీత ఉండటానికి కారణం ఆమె భర్త రామ్. ఒక యూట్యూబ్ మీడియా సంస్థను నడుపుతున్న రామ్.. నితిన్‌కు చాలా క్లోజ్ అని చాలామందికి తెలియదు. రామ్, సునీత బంధం బలపడటంతో, వారి పెళ్లి జరగడంలో నితిన్ పాత్ర కీలకం అంటారు. వీరి పెళ్లి రిసెప్షన్‌ను నితిన్ దగ్గరుండి జరిపించడం.. ఆ వేడుకను హోస్ట్ చేయడం విశేషం.
ఈ నేపథ్యంలోనే నితిన్ పుట్టిన రోజు వేడుకల్లో సునీత, రామ్ ప్రత్యేకంగా కనిపించారు. ఇండస్ట్రీలో నితిన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కూడా ఈ వేడుకలో పాల్గొంది. నితిన్ పక్కన అతడి సతీమణి షాలిని కూడా ఉంది. ఈ పుట్టిన రోజుకు నితిన్ చాలా సంతోషంగా ఉన్నాడు. పెళ్లి తర్వాత జరుగుతున్న తొలి పుట్టిన రోజు ఇదే కాగా.. సరిగ్గా ‘రంగ్ దే’ సినిమాతో మంచి విజయాన్నందుకున్న సమయంలో బర్త్ డే రావడం సంతోషాన్ని రెట్టింపు చేసేదే.
గత నెలలో ‘చెక్’తో షాక్ తిన్న నితిన్.. ‘రంగ్ దే’ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. సోమవారం హోలి సెలవును బాగా ఉపయోగించుకున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.13 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇక నితిన్ పుట్టిన రోజు కానుకగా అతడి కొత్త సినిమా ‘మాస్ట్రో’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం తెలిసిందే.
This post was last modified on March 30, 2021 1:02 pm
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…