Movie News

ఈమె కెరీర్‌ను కాపాడేదెవ‌రు?


మామూలుగా హీరోయిన్ల తొలి సినిమాలు హిట్ట‌యితేనే త‌ర్వాత అవ‌కాశాలు వ‌స్తాయి. కానీ కొంత‌మంది హీరోయిన్ల‌కు మాత్రం తొలి సినిమా ఫ‌లితం లేకుండా మంచి పేరొస్తుంది. త‌మ అందంతో, అభిన‌యంతో వాళ్లు త‌మ‌దైన ముద్ర వేస్తుంటారు. లావ‌ణ్య త్రిపాఠి ఆ కోవ‌కే చెందుతుంది. ఈ ఉత్త‌రాది భామ తెలుగులో చేసిన తొలి సినిమా అందాల రాక్ష‌సి పెద్ద‌గా ఆడ‌లేదు. కానీ ఆ సినిమాలో ఆమె పాత్ర మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ప్ర‌త్యేక‌మైన ఆమె అందం కుర్రాళ్ల మ‌న‌సుల‌కు గాయం చేసింది. ఆమెకు అభిమాన‌గ‌ణం బాగానే త‌యారైంది. దీంతో మంచి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి.

దూసుకెళ్తా, సోగ్గాడే చిన్నినాయ‌నా, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ లాంటి విజ‌యాల‌తో లావ‌ణ్య ఒక ద‌శ‌లో ప్రామిసింగ్‌గా క‌నిపించింది. కానీ ఆ విజ‌యాల‌ను ఆమె నిల‌బెట్టుకోలేక‌పోయింది.

గ‌త కొన్నేళ్ల‌లో అర్జున్ సుర‌వ‌రం మిన‌హాయిస్తే లావ‌ణ్య‌కు ఓ మోస్త‌రు హిట్ కూడా లేదు. ఆ సినిమా త‌ర్వాత త‌న నుంచి వ‌స్తున్న చిత్రాలు నిరాశ ప‌రుస్తూ కెరీర్‌ను ప్ర‌శ్నార్థకం చేస్తున్నాయి. తాజాగా రెండు వారాల వ్య‌వ‌ధిలో ఆమె సినిమాలు రెండు రిలీజ‌య్యాయి. ఈ సినిమాల మీద లావ‌ణ్య చాలా ఆశ‌లే పెట్టుకుంది. కానీ సందీప్ కిష‌న్‌తో చేసిన ఎ1 ఎక్స్‌ప్రెస్ కానీ.. కార్తికేయ స‌ర‌స‌న న‌టించిన చావుక‌బురు చ‌ల్ల‌గా కానీ ఆమెకు ఆశించిన ఫ‌లితాలివ్వ‌లేదు.

ఎ1 ఎక్స్‌ప్రెస్‌కు ఆమె గ్లామ‌ర్ ప్ల‌స్ కాలేదు. అలాగే చావు క‌బురు చ‌ల్ల‌గాలో డీగ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తూ న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర చేయ‌గా అదీ నిరాశ‌ప‌రిచింది. ఈ రెండు సినిమాల ఫ‌లితాలు లావ‌ణ్య భ‌విష్య‌త్తు మీద తీవ్ర ప్ర‌భావ‌మే చూపేలా ఉన్నాయి. ఆమె చేతిలో ప్ర‌స్తుతం సినిమాలే లేవు. పై రెండు సినిమాలు ఆడితే అవ‌కాశాలు వ‌చ్చేవేమో. అవి రెండూ పోవ‌డంతో ఇక ఆమె కెరీర్ ముందుకు సాగ‌డ‌మే క‌ష్టంగా ఉంది.

This post was last modified on March 30, 2021 7:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

60 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago