సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరేళ్ల ముందే నిర్మాతగా మారాడు. శ్రీమంతుడు సినిమాలో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లోనూ అతడి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ భాగమైంది. ఐతే ఆ సినిమాలకు అతడి బేనర్ సమర్పణకే పరిమితం అయింది. నిజంగా మహేష్ ప్రొడక్షన్లోకి దిగి చేసిందేమీ లేదు. మహేష్ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారుతోందంటే మేజర్ సినిమాతోనే.
ఈ సినిమాకు వేరే రెండు సంస్థలు చేతులు కలుపుతున్నప్పటికీ ప్రధాన నిర్మాత మహేష్ బాబే. ఈ తరహాలో వేరే హీరోలతో చిన్న, మీడియం రేంజిలో మరిన్ని సినిమాలు చేయడానికి మహేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర కాంబినేషన్ కుదిరినట్లు తెలుస్తోంది. మహేష్ ప్రొడక్షన్లో యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్ల తర్వాత వెంకీకి టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అతను ఏకంగా రామ్ చరణ్ లాంటి బడా స్టార్‌తో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. మహేష్ బాబుతో సినిమా కోసం కూడా ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి నవీన్ పొలిశెట్టితో సినిమాకు పరిమితం కావడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ టాలెంట్ చూశాక రాబోయే రోజుల్లో అతను పెద్ద రేంజికి వెళ్తాడన్న అంచనాలు ఏర్పడ్డాయి.
వెంకీ అతడిని సరిగ్గా ఉపయోగించుకుని దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్ కొడితే.. కచ్చితంగా తర్వాతి సినిమాకు ఓ పెద్ద హీరోనే దొరుకుతాడు. బహుశా తనతో సినిమా కోసం ప్రయత్నించిన వెంకీకి మహేష్ ఈ రకంగా అవకాశం ఇచ్చి ఉండొచ్చు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on March 28, 2021 10:44 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…