టాలీవుడ్లో ప్రయోగాత్మక, సాహసోపేత చిత్రాలకు, పాత్రలకు కేరాఫ్ అడ్రస్ దగ్గుబాటి రానా. హీరోగా కెరీర్ ఆరంభంలో ఎదురు దెబ్బల తర్వాత అతను లీడ్ రోల్స్ కోసం చూడకుండా విభిన్న పాత్రల వైపు అడుగులేశాడు. ఈ క్రమంలోనే ‘బాహుబలి’ లాంటి కెరీర్‌ను మలుపు తిప్పే పాత్ర పడింది. ఇక అతను వెనుదిరిగి చూసుకోలేదు. గత కొన్నేళ్లలో ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన రానా.. కెరీర్లో మరో మైలురాయి లాంటి పాత్రను ‘అరణ్య’లో చేశాడు. ఇలాంటి పాత్రలు అందరు నటులనూ వరించవు. అందరూ కూడా అలాంటి వాటికి న్యాయం చేయలేరు. ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు కానీ.. రానా నటన విషయంలో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని, ది బెస్ట్ అని అందరూ పొగిడేస్తున్నారు. కానీ ఈ ప్రశంసల సంగతలా ఉంచితే.. సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మాత్రం చేదు అనుభవం తప్పేట్లు లేదు.
‘అరణ్య’ సినిమా ఎప్పుడో ఏడాది కిందటే పూర్తయింది. నిజానికి ఈ సినిమాను పూర్తి చేయడంలోనూ ఆలస్యం జరిగింది. రానా అనారోగ్యం అందుకు కారణం. ప్రొడక్షన్ కాస్ట్‌కు తోడు సినిమా ఆలస్యం కావడం వల్ల పడ్డ వడ్డీల భారాన్ని కూడా కలుపుకుంటే రిలీజ్ సమయానికి ఈ సినిమా రూ.60 కోట్లు వెనక్కి తేవాల్సిన స్థితిలో నిలిచింది. మధ్యలో ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ తలొగ్గలేదు. థియేటర్లలో మంచి వసూళ్లు వస్తాయని ఆశించింది. కానీ సరిగ్గా రిలీజ్ డేట్‌కు మూడు రోజుల ముందు కరోనా, ఇతర కారణాలతో హిందీ సినిమా విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో కష్టం మీద రిలీజ్ చేశారు కానీ.. రెండు చోట్లా అనుకున్నంతగా బజ్ రాలేదు. ఓపెనింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి. సినిమా వీకెండ్లోనే నిలబడలేకపోయింది.
హిందీ మార్కెట్ చూస్తే అక్కడ పెద్ద సినిమాలకు కూడా వసూళ్లుండట్లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు బాగుపడేలా లేవు. ఇక్కడ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు అక్కడ ఏమాత్రం సానుకూల స్పందన వస్తుందన్నది సందేహమే. హిందీ వెర్షన్ రిలీజ్ కాకుండా తెలుగు, తమిళ వెర్షన్లను ఇప్పుడిప్పుడే ఓటీటీలోనూ రిలీజ్ చేయలేరు. గ్యాప్ పెరిగే కొద్దీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రేటు తగ్గుతూ వస్తుంది. ఆ ప్రభావం శాటిలైట్ హక్కుల మీదా పడుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలకు చాలా నష్టం తప్పేట్లు లేదు. సినిమా ఔట్ పుట్ చూసుకుని థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి, ముందే ఏ ఓటీటీకో సినిమాను అమ్మేసి ఉంటే నిర్మాతలు బయటపడిపోయేవాళ్లమేమో. థియేట్రికల్ రిలీజ్ కోసం ఇంత కాలం ఆగి చేజేతులా సినిమాను చంపేసుకున్నట్లు అయింది.
This post was last modified on March 28, 2021 11:07 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…