Movie News

పిక్ టాక్: చంపేసిందే చంపేసిందే

ఇంతకుముందు హీరోయిన్లకు పాపులారిటీ రావాలంటే పేరున్న సినిమాల్లో నటించాలి. అవి సక్సెస్ కావాలి. నిలకడగా విజయాలు సాధిస్తూ ముందుకెళ్లాలి. అప్పుడు కానీ ఒక స్థాయి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వ్యవహారం వేరు. కుర్రాళ్లకు విందును పంచే అందచందాలు ఉండి.. వాటిని ఎలివేట్ చేసేలా ఫొటో షూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే చాలు. పాపులారిటీ దానంతట అదే వచ్చేస్తుంది. కేవలం ఫొటో షూట్లతో.. సోషల్ మీడియాలో మంచి ఆదరణ తెచ్చుకుని స్టార్ హీరోయిన్లకు దీటుగా ఫాలోయింగ్ తెచ్చుకున్న అమ్మాయిలు చాలామందే ఉన్నారు.

బాలీవుడ్లో దిశా పఠాని, ఊర్వశి రౌతెలా, ఇషా గుప్తా లాంటి సెక్సీ భామలు ఇలా పాపులర్ అయిన వాళ్లే. తెలుగు హీరోయిన్లలో ప్రగ్యా జైశ్వాల్ కూడా ఇలాగే సోషల్ మీడియా ఫాలోవర్లను మురిపిస్తూ ఉంటుంది. తమిళ సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. ఫొటో షూట్లు చేయాలన్నా, కుర్రాళ్లను కవ్వించాలన్నా మాళవిక మోహనన్ తర్వాతే ఎవరైనా.

రజినీకాంత్ సినిమా ‘పేట’లో ఆయన చెల్లెలి పాత్రతో వెలుగులోకి వచ్చింది మాళవిక. ఆ సినిమాలో ఆమెను ట్రెడిషనల్ రోల్‌లో చూసి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత చూపించింది తనలోని హాట్ యాంగిల్. ఆమె చేసే ఫొటో షూట్లు చూసి కుర్రాళ్లకు మతులు పోయాయి. ఇంత సెక్సప్పీల్ పెట్టుకుని చెల్లెలి పాత్ర చేసిందేంటి ఆశ్చర్యపోయారు. చూస్తుండగానే ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయింది. కోట్లల్లో ఆమెకు అభిమానులు తయారయ్యారు.

బాలీవుడ్ భామలకు దీటైన సెక్సీ పోజులతో.. క్లీవేజ్ షోలతో రెచ్చిపోతూ సోషల్ మీడియాను తరచుగా తగలబెట్టేస్తుంటుంది మాళవిక. తాజాగా ఆమె ప్రకృతి అందాల మధ్య ఆమె చేసిన ఒక ఔట్ డోర్ ఫొటో షూట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆకుపచ్చ రంగు డ్రెస్సులో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ.. మత్తెక్కించే చూపులతో ఆమె ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు ‘చంపేసిందే చంపేసిందే..’ అని పాడుకుంటున్నారు.

This post was last modified on March 28, 2021 9:16 am

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

14 minutes ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

2 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

3 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

4 hours ago