Movie News

నితిన్ దున్నుకోవచ్చు


ఈ రోజుల్లో ఒక సినిమా ఆడాలంటే చాలా విషయాలు కలిసి రావాలి. ప్రతి వారం రెండు మూడు సినిమాలకు తక్కువ కాకుండా రిలీజవుతున్నాయి. ముందు వారాల్లో బాగా ఆడుతున్న సినిమాలు ఉంటున్నాయి. తర్వాతి వారానికి సినిమాలు రెడీగా ఉంటాయి. ఇంత పోటీని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేయడం చిన్న విషయం కాదు.

పోటీలో ఉన్న సినిమాలన్నింటికంటే మెరుగైన టాక్ తెచ్చుకోవడం.. యూత్, ఫ్యామిలీస్‌ను ఆకర్షించడం కీలకం. ఈ విషయాల్లో ఏది సక్సెస్ అయితే దానికి ప్రేక్షకులు పట్టం కట్టేస్తున్నారు. అంచనాలను మించి వసూళ్లు అందిస్తున్నారు. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలకు ఇలాగే పరిస్థితులు కలిసొచ్చాయి. ఈ వారం ‘రంగ్ దే’ ఆ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. మరీ ప్రత్యేకమైన సినిమా కాదు. ఇందులో కొత్త విషయాలేమీ లేవు.

కానీ ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచే అంశాలు ‘రంగ్ దే’లో ఉన్నాయి. అందమైన లీడ్ పెయిర్, వాటి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయింది. యూత్, ఫ్యామిలీస్ కోరుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ పెద్ద ప్లస్. ఒక అందమైన ప్యాకేజీలా ఈ సినిమా తయారైంది. సినిమా చూసిన ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలగకపోయినా రిగ్రెట్ అయ్యే పరిస్థితి లేదు.

వీకెండ్లో థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఈ మాత్రం చాలు. దీంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్లో ఈ సినిమా బాక్సాఫీస్ లీడర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి పోటీగా శుక్రవారం వచ్చిన ‘అరణ్య’కు టాక్ బాగా లేదు. పైగా అది సీరియస్ సినిమా. శనివారం రిలీజైన ‘తెల్లవారితే గురువారం’కు కూడా మంచి టాక్ రాలేదు. గత రెండు వారాల్లో బాక్సాఫీస్‌ను డామినేట్ చేసిన ‘జాతిరత్నాలు’ కూడా స్లో అయింది. ఈ నేపథ్యంలో వారం పాటు వసూళ్లు దున్నుకోవడానికి నితిన్ సినిమాకు మంచి స్కోప్ ఉన్నట్లే.

This post was last modified on March 28, 2021 6:46 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

4 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

6 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

6 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

8 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

9 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

10 hours ago