Movie News

ఇండియన్ సినిమాకు ‘హాలీవుడ్’ గండం


ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో రిలీజైన కొన్ని నెలలకు కానీ ఇండియాలోకి వచ్చేవి కావు. హాలీవుడ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని వరల్డ్ వైడ్ సంచలనం రేపిన సినిమాలకు మన దగ్గర హైప్ వచ్చేది. వాటి కోసం ఎదురు చూసేవాళ్లు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హాలీవుడ్ సినిమాలు వరల్డ్ వైడ్ ఎప్పుడు రిలీజవుతున్నాయో.. ఇండియాలోనూ అప్పుడే థియేటర్లలోకి దిగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఇండియాలోనే హాలీవుడ్ సినిమాలు ముందు రిలీజ్ కావడమూ చూస్తున్నాం. ప్రపంచంవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైన సూపర్ హీరో, ఎనిమల్ క్యారెక్టర్లను పెట్టి ఫ్రాంఛైజీ సినిమాలు తీసినపుడు వాటికొచ్చే హైపే వేరుగా ఉంటోంది. రెండేళ్ల కిందట ‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’కు ఏ స్థాయిలో క్రేజ్ వచ్చిందో తెలిసిందే. దాని ధాటికి ఇండియా సినిమాలు షేకైపోయాయి.

ఇప్పుడు మరో హాలీవుడ్ మూవీ.. భారతీయ చిత్రాలకు గండంగా మారింది. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్.. ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న సినిమా ఇది. బుధవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.6 కోట్ల గ్రాస్ వచ్చింది. వీక్ డేలో ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు రావడం అనూహ్యం. గత వారాంతంలో వచ్చిన హిందీ చిత్రం ‘ముంబయి సెగా’కు తొలి రోజు గ్రాస్ రూ.3 కోట్ల లోపే వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఉత్తరాదిన ఆ చిత్రానికి ఆశించిన వసూళ్లు రాలేదు. కానీ ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ మీద మాత్రం వైరస్ ప్రభావం కనిపించలేదు. తమ దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా విషయానికి వచ్చేసరికి జనాలు కరోనాను పట్టించుకోవట్లేదన్నది స్పష్టం.

దేశవ్యాప్తంగా ఈ చిత్రం మల్టీప్లెక్సుల్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. లోకల్ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రానికి అన్ని భాషల్లోనూ భారీగా స్క్రీన్లు కేటాయిస్తున్నారు. పిల్లలకు బాగా నచ్చే సినిమా కావడంతో ఫ్యామిలీస్ థియేటర్లకు వరుస కడుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ వారం రిలీజవుతున్న ‘రంగ్ దె’, ‘అరణ్య’ సినిమాలకు మించి ఈ చిత్రానికి మల్టీప్లెక్సులు షోలు కేటాయించడం విశేషం. వాటి వసూళ్లపై ‘గాడ్జిల్లా వెర్స్ కింగ్’ బాగానే ప్రభావం చూపేలా ఉంది. మిగతా భాషా చిత్రాలకైతే ఈ హాలీవుడ్ మూవీ పెద్ద గండంలాగే మారింది. లాంగ్ వీకెండ్‌ను ఉపయోగించుకుని ఆదివారం అయ్యేసరికి ఈ చిత్రం రూ.30 కోట్లకు తక్కువ కాకుంగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

This post was last modified on March 25, 2021 2:22 pm

Share

Recent Posts

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

22 seconds ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

3 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

5 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

6 hours ago