మహేష్ అని.. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దగ్గర మూడేళ్లుగా కోడైరెక్టర్‌గా పని చేస్తున్నాడట. ఐతే అవసరాల ఆఫీస్‌కు వెళ్తే తాను ఏ తప్పు చేయకపోయినా.. అందరి ముందు చెడామడా తిట్టి బయటికి పంపించేశాడంటూ ఆరోపించాడు మహేష్. అవసరాల ఆఫీస్ నుంచే ఒక వీడియో తీసి అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవసరాల తనను అవమానించాడన్న విషయం చెప్పాక.. అతడి నిజ స్వరూపం చూపిస్తానంటూ లోపలికెళ్లాడు మహేష్. అక్కడ ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల దగ్గరికెళ్లి.. తనతో తగువు పెట్టుకున్నాడు.
నిన్నెవరు లోపలికి రానిచ్చారంటూ అవసరాల అతడితో వాదనకు దిగితే.. ఉన్నట్లుండి అతడి నెత్తిన ఉన్న విగ్గు లాగేసి, ఇదీ అవసరాల నిజ స్వరూపం, అతడికి బట్టతల అనే విషయం బయటపెట్టాడు. ఈ వీడియో బయటికి వెళ్తే నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా మహేష్ అని అవసరాల బెదిరిస్తుంటే.. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లోనూ ఈ వీడియో పెట్టేస్తా అని మహేష్ అరవడంతో ఈ వీడియో ముగిసింది. ఈ వీడియో చూసి చాలామంది సీరియస్‌గా స్పందిస్తున్నారు. అవసరాలకు బట్టతలా.. అతను అసిస్టెంట్‌ను వేధించాడా అని ఆశ్చర్యపోతున్నారు.
ఐతే ఈ వీడియో నిజంగా సీరియస్‌గా తీసిందేనా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ప్లాన్ చేసిన వీడియోగా దీన్ని భావిస్తున్నారు. బాలీవుడ్లో హిట్టయిన బాలా సినిమాను తెలుగులో అవసరాల హీరోగా రీమేక్ చేస్తున్నారని.. ఇందులో బట్టతలతో బాధ పడే యువకుడి పాత్రలో అవసరాల కనిపించనున్నాడని.. ఈ నేపథ్యంలో ఇలా వెరైటీగా ఒక వీడియో వదిలి సినిమా పట్ల జనాల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారని.. త్వరలోనే అసలు విషయం వెల్లడవుతుందని అంటున్నారు.
This post was last modified on March 25, 2021 10:53 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…