Movie News

రానా సినిమాకు మ‌ళ్లీ బ్రేక్


2020 వేస‌విలో రావాల్సిన సినిమా అర‌ణ్య‌. ఈ సినిమా అంత‌కు రెండేళ్ల ముందు మొద‌లైంది. బాహుబ‌లి-ది కంక్లూజ‌న్ పూర్త‌య్యాక ఈ చిత్రాన్ని మొద‌లుపెట్టాడు రానా ద‌గ్గుబాటి. కానీ అత‌డి అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల‌, అలాగే అట‌వీ లొకేష‌న్ల‌లో భారీ స్థాయిలో ఈ సినిమా తీయాల్సి రావ‌డం వ‌ల్ల బాగా ఆల‌స్యం జ‌రిగింది. చివ‌రికి సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేశాక‌.. క‌రోనా వ‌చ్చి బ్రేకులేసింది. ఏడాది పాటు సినిమాను ఆపి ఎట్ట‌కేల‌కు మార్చి 26న విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం చేశారు.

తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ విడుద‌ల‌కు ఇంకో మూడు రోజులే ఉండ‌గా.. నిర్మాత‌లు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ చిత్రంలో భాగ‌స్వామి అయిన ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ హిందీ వెర్ష‌న్ విడుద‌ల‌ను వాయిదా వేసేసింది. ఈ మేర‌కు ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది.

హిందీ సినిమాల‌కు కేంద్ర స్థానం అయిన మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విజృంభిస్తోంది. ఉత్త‌రాదిన మ‌రికొన్ని రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం ఎక్కువై అనేక చోట్ల సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఆపేస్తున్నారు. లేదా స‌గం ఆక్యుపెన్సీకి ప‌రిమితం చేస్తున్నారు. జ‌నాలు ఇళ్లు దాటి బ‌య‌టికి రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో హిందీ సినిమాల ప‌రిస్థితి దారుణంగా ఉంది.

ముంబ‌యి సెగా చిత్రం మంచి టాక్ తెచ్చుకుని కూడా వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోతోంది. సాధార‌ణ స‌మ‌యాల్లో వ‌చ్చే వ‌సూళ్ల‌తో పోలిస్తే దీనికి 40 శాతం క‌లెక్ష‌న్లు మాత్ర‌మే వ‌చ్చాయి వీకెండ్లో. ఈ ప‌రిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయ‌డం అంటే చేజేతులా చంపుకోవ‌డ‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత‌కాలం ఆపి, ఇలాంటి స్థితిలో హాథీ మేరీ సాథీని రిస్క్ చేసి రిలీజ్ చేయ‌డం మంచిది కాద‌ని ఈరోస్ సంస్థ నిర్ణ‌యించుకుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో మాత్రం ఈ సినిమా య‌ధావిధిగా రిలీజ‌వుతుంద‌ని, హిందీ రిలీజ్ గురించి త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌ని ఆ సంస్థ పేర్కొంది.

This post was last modified on March 24, 2021 7:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

13 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

51 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago