సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కొంతమేర డివైడ్ టాక్‌ను కూడా తట్టుకుని నిలబడ్డ ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. వ్యవసాయం ప్రాధాన్యాన్ని తెలియజెప్పే ఉదాత్తమైన కథాంశం ఇందులో మిళితమై ఉండటంతో ఈ చిత్రానికి విమర్శల ప్రశంసలూ దక్కాయి.
ఇప్పుడు ‘మహర్షి’ ఉత్తమ జనరంజక చిత్రంగా జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సినిమాకు నృత్యరీతులు సమకూర్చిన రాజు సుందర్ నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గానూ అవార్డు అందుకున్నారు. ఐతే ‘మహర్షి’ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే.. ఈ చిత్రం జాతీయ అవార్డు గెలుస్తుందని మహేష్ బాబు అంచనా వేయడం విశేషం. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి.
‘మహర్షి’ కంటే ముందు వంశీ తీసిన ‘ఊపిరి’కి గొప్ప ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వంశీ ఫిలిం ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆ సందర్భంగా మహేష్.. వంశీకి శుభాకాంక్షలు చెబుతూ ఒక మెసేజ్ పంపాడు. ఇందులో భాగంగా.. తర్వాతి సినిమాకు జాతీయ పురస్కారం అందుకుంటావని పేర్కొన్నాడు. బదులుగా కృతజ్ఞతలు చెబుతూ వంశీ.. అందుకోసం గట్టిగా ప్రయత్నిస్తానని అన్నాడు. దీనికి మహేష్ స్పందిస్తూ.. ఈ సినిమా కోసం ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లమని పేర్కొన్నాడు.
ఈ స్క్రీన్ షాట్‌ను ఇప్పుడు వంశీ షేర్ చేస్తూ.. మహేష్ చూపించిన నమ్మకం వల్లే ఇప్పుడు మహర్షికి ఈ పురస్కారం దక్కిందని.. తనపై ఆయనకెంత భరోసానో చెప్పడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాడు. ఈ స్క్రీన్ షాట్ చూసి.. మహేష్‌కు ‘మహర్షి’ మీద స్క్రిప్టు దశలోనే ఇంత గురి కుదిరిందా, జాతీయ అవార్డు గురించి అప్పుడే ఎలా చెప్పగలిగాడో అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.
This post was last modified on March 23, 2021 2:23 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…