ఈ తరంలో తనను మించిన కథానాయిక ఇండియాలో లేదని కంగనా రనౌత్ మరోసారి చాటి చెప్పింది. ఆమె తన ఖాతాలోకి నాలుగో జాతీయ అవార్డును వేసుకుంది. వ్యక్తిగతంగా కంగనా ఎంతటి వివాదాస్పదురాలో.. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఆమె పొలిటికల్ ప్రాపగండాల్లో భాగంగా మారి సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తోందో తెలిసిందే. కానీ నటిగా మాత్రం కంగనా స్థాయి వేరు. తెరమీద ఆమె పెర్ఫామెన్స్ చూసి ఫిదా అవ్వని వాళ్లు లేరు.
ఇప్పుడు కంగనా మరోసారి జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక కావడానికి మోడీ సర్కారు అండే కారణం అనే వాళ్లూ లేకపోలేదు. కానీ మణికర్ణిక, పంగా సినిమాల్లో కంగనా నటన చూశాక ఆమె ఈ అవార్డుకు అర్హురాలనే అనిపిస్తుంది. నటిగా ఆమె కొత్తగా రుజువు చేసుకోవాల్సిందేమీ కూడా లేదు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఆమె సత్తా చాటుకుంది.
ఫ్యాషన్ సినిమాలో నటనకు గాను తొలిసారి కంగనా ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాలు గెలుచుకుంది. ఇప్పుడు నాలుగో అవార్డును సొంతం చేసుకుంది. ఆమె ఇంకొక్క జాతీయ అవార్డు గెలిస్తే.. ఇండియాలో అత్యధిక జాతీయ అవార్డులు సాధించిన నటిగా లెజెండరీ షబానా ఆజ్మీ సరసన చేరుతుంది కంగనా.
షబానా అంకుర్, అర్థ్, కాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకు జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఐదుసార్లూ ఆమె ఉత్తమ నటి పురస్కారాన్నే గెలుచుకుంది. కంగనా మూడుసార్లు ఉత్తమ నటిగా, ఒకసారి ఉత్తమ సహాయ నటిగా అవార్డులు సాధించింది. ఎలా అయితేనేం ఆమె ఖాతాలో నాలుగు పురస్కారాలున్నాయి. ఇంకో అవార్డు సాధిస్తే షబానాను సమం చేసి చరిత్రలో నిలిచిపోతుంది కంగనా. ఆమెకది కష్టం కాకపోవచ్చు.
This post was last modified on March 23, 2021 9:44 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…