మన దగ్గర తమిళ స్టార్లకు ఎప్పట్నుంచో మంచి మార్కెట్ ఉంది. వాళ్లను ఆదరించినట్లుగా వేరే భాషలకు చెందిన స్టార్లను నెత్తిన పెట్టుకున్న చరిత్ర లేదు. ముఖ్యంగా కన్నడ స్టార్లకు ఇక్కడ ఆదరణ తక్కువే. ఒక్క ఉపేంద్ర మాత్రమే కొన్ని సినిమాలతో ఆకట్టుకున్నాడు. కొంత మార్కెట్ సంపాదించాడు. అది కూడా తర్వాత కోల్పోయాడు. ఆ తర్వాత సుదీప్ ‘ఈగ’ సినిమా ద్వారా గుర్తింపు సంపాదించాడు. కానీ అతను కూడా దాన్ని ఉపయోగించుకోలేదు. హీరోగా అయితే అతడికి ఇక్కడ మార్కెట్ లేదు.
ఐతే ‘కేజీఎఫ్’ సినిమాతో యశ్‌కు మాత్రం తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలాగని అతడి ప్రతి సినిమానూ ఇక్కడ రిలీజ్ చేసేస్తే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు. ‘గజకేసరి’ అనే సినిమాను రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ‘కేజీఎఫ్-2’కు మాత్రం బంపర్ క్రేజ్ ఉంది. మన ఇండస్ట్రీ ప్రమాణాలకు తగ్గట్లు, అంతకుమించి ఏదైనా సినిమాను రిలీజ్ చేస్తే భాషా భేదం లేకుండా చూస్తారు మన ఆడియన్స్.
ఈ విషయం అర్థం చేసుకోకుండా ‘కేజీఎఫ్’ ఆడిందని కన్నడలో వచ్చిన మాస్ మసాలా సినిమాలన్నింటినీ ఇక్కడ దించేస్తున్నారు. అక్కడి స్టార్లందరికీ తెలుగు మార్కెట్ మీద ఆశలు పుడుతున్నాయి. ఈ మధ్యే దర్శన్ నటించిన ‘రాబర్ట్’ అనే సినిమాకు చాలా హడావుడి చేసి తెలుగులో రిలీజ్ చేశారు. కానీ దాన్నెవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్ మీదికి దండయాత్రకు వస్తున్నాడు.
‘యువరత్న’ పేరుతో తెరకెక్కిన అతడి కొత్త చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు కొత్తగా అనిపించే విషయాలేమీ లేవు. మనం ఎప్పుడో చూసేసిన హీరో ఎలివేషన్లు ఇందులో కనిపిస్తున్నాయి. ఇలాంటి రొటీన్ సినిమాతో మన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం చాలా కష్టం. పైగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్ చేయబోతున్నారు. తర్వాతి రోజు ‘వైల్డ్ డాగ్’; ‘సీటీమార్’ లాంటి పేరున్న సినిమాలు వస్తున్నాయి. ముందు వారం రంగ్ దె, అరణ్య రిలీజవుతున్నాయి. ఇంత పోటీ మధ్య ఓ కన్నడ డబ్బింగ్ సినిమాను మనోళ్లు ఎక్కడ పట్టించుకుంటారు. కన్నడ స్టార్లు ‘కేజీఎఫ్’ టైపులో సెన్సేషనల్ చిత్రాలేవైనా చేసి తెలుగు మార్కెట్ వైపు చూడాలి తప్ప.. ఇలాంటి సినిమాలతో అయితే ఇక్కడ మార్కెట్ మీద ఆశలు పెట్టుకోవడం వేస్ట్.
This post was last modified on March 21, 2021 8:59 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్…
వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ బాలకృష్ణ ఖాతాలో వేసిన డాకు మహారాజ్ ఎనిమిది రోజులకు 156 కోట్లకు పైగా గ్రాస్…
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే.…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త…
డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా…
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…