జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయింది. అతను 2017 చివరి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకే తన సమయాన్ని అంకితం చేశాడు. బాహుబలి లాగా ఆర్ఆర్ఆర్‌ను సాగదీయకుండా రెండేళ్లలో రిలీజ్ చేసేయాలని రాజమౌళి అనుకున్నాడు కానీ.. అతడి ప్రణాళికలు ఫలించలేదు. ఎప్పట్లాగే ఈ సినిమా కూడా ఆలస్యమైంది. ఐతే ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. అతి త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి సెలవు తీసుకోబోతున్నాడు.
ఐతే ఆర్ఆర్ఆర్ కోసం విపరీతంగా కష్టపడినప్పటికీ.. తన తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి ముందు జూనియర్ ఏమీ విరామం తీసుకోవట్లేదట. ఆర్ఆర్ఆర్ కోసం చాలా టైం పెట్టేయడం, తన కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏడాదికి పైగా ఎదురు చూస్తుండటంతో తారక్ బ్రేక్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఇంకో నెల రోజుల్లోపే ప్రారంభోత్సవం జరుపుకోనుందట. ఏప్రిల్ 13న ఉగాది సందర్భంగా ఈ సినిమాకు ముహూర్త వేడుక చేయబోతున్నారట. ఆ నెల చివరి నుంచి అతను ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటాడట. మే నెల అంతా అతను ఫుల్‌గా కాల్ షీట్లను ఈ సినిమాకు కేటాయించినట్లు తెలుస్తోంది.
హారిక అండ్ హాసిని బేనర్లో బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయిక గురించి రకరకాల వార్తలొచ్చాయి. కానీ ఎవరు ఖరారయ్యారన్నది వెల్లడి కాలేదు. డిసెంబరు కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి కొత్త ఏడాదిలో ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాలని తారక్ భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2022 వేసవిలో విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ సినిమాకు అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 17, 2021 9:46 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…