మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో సూపర్ హిట్టయిన ‘నా పేరే కాంచనమాల’ పాటలో నటించిన అమ్మాయి గుర్తుందా? బాలీవుడ్‌కు చెందిన ఈ భామ పేరు గౌహర్ ఖాన్. ఇప్పుడీ అమ్మాయి వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గౌహర్ కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ షూటింగ్‌లో పాల్గొందంటూ ఆమెపై ముంబయి పోలీసులు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ విషయమై మీడియాకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు.
‘‘కరోనా సోకిన వ్యక్తి పాటించాల్సిన మార్గనిర్దేశకాలను గౌహర్ ఖాన్ పాటించలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మాకు ముంబయి సిటీ క్షేమం ప్రధానం. నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి. అందుకే గౌహర్ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. కరోనా విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని ఆ ప్రెస్ నోట్లో ముంబయి పోలీసులు పేర్కొన్నారు.
కరోనా ఉన్నా కూడా గౌహర్ ఖాన్ ఎలా షూటింగ్‌లో పాల్గొందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. సహచరుల ప్రాణాలు రిస్క్‌లో పెట్టడం సమంజసమేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఆమె నటిస్తున్న సినిమాకు సంబంధించిన యూనిట్ మాత్రం పోలీసుల ఆరోపణలను ఖండించింది.
గౌహర్ ఖాన్‌కు కరోనా నెగెటివ్ వచ్చాకే షూటింగ్‌లో పాల్గొన్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. గౌహర్ తీవ్ర మానసిక వేదనలో ఉన్నట్లు పేర్కొంది. పది రోజుల కిందటే గౌహర్ తండ్రి చనిపోయారని.. దానికి సంబంధించిన విషాదంలో ఉండగా ఈ ఆరోపణలు ఆమెను మరింత కుంగదీస్తున్నాయని చిత్ర బృందం వివరించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే గౌహర్ నడుచుకుంటోందని.. ఆమెపై అనవసర అభాండాలు వేయొద్దని చిత్ర యూనిట్ కోరింది. ఐతే దీనిపై గౌహర్ మాత్రం ఏమీ స్పందించట్లేదు. ఆమె వివరణ కోసం మీడియా వాళ్లు ప్రయత్నించినా స్పందించలేదు.
This post was last modified on March 16, 2021 4:31 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…