ఫ్లాప్ సినిమాలతో కూడా గౌరవం సంపాదించుకున్న దర్శకుడంటూ ఓ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్.. సుకుమార్‌ను పొగిడిన విషయం జనాలకు గుర్తుండే ఉంటుంది. ఆయన కెరీర్లో పెద్ద డిజాస్టర్లుగా నిలిచిన 1 నేనొక్కడినే, జగడం సినిమాలు కూడా కల్ట్ స్టేటస్ అందుకోవడం అందుకు నిదర్శనం.
ఆర్య లాంటి బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా పరిచయమైన సుక్కు.. రెండో ప్రయత్నంలో చేసిన జగడం బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక ఫలితాన్నందుకుంది. కానీ ఆ సినిమా నచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. టీవీలోనో, యూట్యూబ్‌లోనూ ఈ సినిమా చూసి ఏం తీశాడని పొగిడేవాళ్లకు లెక్క లేదు. ఈ చిత్రం విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుకుమార్ నోస్టాల్జిక్ ఫీలింగ్‌లోకి వెళ్లిపోయాడు. ఎంతో ప్రేమతో తాను జగడం సినిమా తీసినట్లు గుర్తు చేసుకున్నాడు. కుదిరితే అదే సినిమాను ఇప్పుడు రామ్‌తో రీమేక్ చేయాలని ఉందని సుక్కు చెప్పడం విశేషం.
జగడం చేసే సమయానికి రామ్ 17 ఏళ్ల కుర్రాడని.. కానీ ఆ వయసులో తాను ఏ ఎక్స్‌ప్రెషన్ అడిగితే అది ఇచ్చాడని.. తెలియని పని చెప్పినా పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి చేసేసేవాడని సుక్కు తెలిపాడు. రామ్‌ను ఆ సినిమా టైంలో చూసినపుడే పెద్ద స్థాయికి వెళ్తాడనుకున్నానని, అతడి ఎనర్జీనే ఇప్పుడు తాను ఉన్న స్థాయికి కారణమని సుక్కు అన్నాడు. కుదిరితే ఇప్పటి రామ్‌ను పెట్టి జగడం సినిమాను మళ్లీ తీయాలని అనిపిస్తోందని సుక్కు చెప్పాడు.
జగడం సినిమాకు రావాల్సినంత అప్రిసియేషన్ రాలేదని అనుకునేవాడినని.. కానీ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీకర్ ప్రసాద్ ఓ సందర్భంలో తనను కలిసినపుడు ముంబయిలో ఎంతోమంది టెక్నీషియన్లు తమ లైబ్రరీలో ఈ సినిమాను పెట్టుకున్నారని, రెఫరెన్స్ లాగా వాడుతున్నారని చెప్పి తనను ఆశ్చర్యపరిచినట్లు సుక్కు వెల్లడించాడు. ఈ సినిమాకు రత్నవేలు అందించిన ఇండియాలోనే ది బెస్ట్ ఫొటోగ్రఫీ వర్క్‌ల్లో ఒకటని సుక్కు తెలిపాడు.
This post was last modified on March 16, 2021 10:19 am
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…