నెలన్నర కిందటే ఒక క్రేజీ రూమర్ టాలీవుడ్లో హల్‌చల్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలో మన యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆమిర్ ప్రస్తుతం చేస్తున్న లాల్ సింగ్ చద్దాలో ఓ ముఖ్య పాత్ర ఉందని.. దానికి చైతూను అడుగుతున్నారని ప్రచారం సాగింది. రెండు మూడు రోజుల ప్రచారం తర్వాత దాని గురించి చర్చలు ఆగిపోయాయి. దాన్ని జస్ట్ రూమర్ లాగే ట్రీట్ చేశారు అందరూ.
కానీ తాజా సమాచారం ప్రకారం చైతూ నిజంగానే ఆమిర్ సినిమాలో నటించబోతున్నాడట. ఈ సినిమా కోసం మేలో డేట్లు కూడా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వార్త నిజమే అయితే.. అక్కినేని అభిమానులకు అంతకంటే సంతోషకరమైన విషయం ఉండదు.
లాల్ సింగ్ చద్దాలో ఒక పాత్ర కోసం సౌత్ ఇండియా నటుడినే తీసుకోవాలని ఆమిర్ అండ్ కో బలంగా నిర్ణయించుకున్నారు. ముందు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి ఓకే అయ్యాడు. కానీ ఏవో కారణాలతో అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పట్నుంచి రకరకాల పేర్లు పరిశీలించి నాగచైతన్యకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సేతుపతి చేయాల్సిన పాత్రకు చైతూ ఏంటి అన్న సందేహం కలగడం సహజం. మరి అతణ్నే ఎందుకు ఎంచుకున్నారో ఏమిటో.
చైతూ తండ్రి నాగార్జున బాలీవుడ్‌లో బాగానే ఫేమస్. ఆయన 90ల్లోనే బాలీవుడ్ సినిమాల్లో మెరిశాడు. ఇప్పుడు కూడా బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నాడు. తండ్రి బాటలో చైతూ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. అది కూడా ఆమిర్ ఖాన్ సినిమాతో అది జరిగితే అక్కినేని అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కతున్న లాల్ సింగ్ చద్దాలో ఆమిర్.. సిక్కు వ్యక్తిగా కనిపించనున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on March 15, 2021 8:46 am
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…