కామెడీ సినిమాలు, కామెడీ హీరోలంటే ఒక రకమైన చిన్న చూపు చూసే రోజుల్లో ఆ సినిమాలకు గొప్ప స్థాయిని అందించి, కామెడీ హీరోగా ఎవరికీ సాధ్యం కాని ఎత్తులకు చేరుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. 80, 90 దశకాల్లో రాజేంద్రుడి హవా ఏ స్థాయిలో నడిచిందో అప్పటి ప్రేక్షకులకు మహ బాగా తెలుసు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహరావు లాంటి దర్శకులతో ఆయన సూపర్ డూపర్ హిట్లు ఎన్నో ఇచ్చారు.
పేరుకు కామెడీ హీరోనే కానీ.. ఏ రసాన్నయినా అద్భుతంగా పండించగల నైపుణ్యం ఆయన సొంతం. తన నటనతో కడుపుబ్బ నవ్వించడమే కాదు.. ఏడిపించనూ గల అరుదైన నటుడాయన. మధ్యలో కొన్నేళ్లు రాజేంద్రుడిని తెలుగు పరిశ్రమ సరిగా ఉపయోగించుకోలేకపోయింది. ఆయన కూడా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి తన స్థాయిని తగ్గించుకున్నారు. కానీ గత కొన్నేళ్లుగా రాజేంద్రుడికి మంచి మంచి కామెడీ పాత్రలు పడుతున్నాయి. ఇప్పుడు ఆయన కెరీర్లోనే ఒకానొక అత్యుత్తమ క్యారెక్టర్ చేసే అవకాశం రావడంతో దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు.
‘గాలి సంపత్’ పేరుతో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు కలయికలో సినిమా మొదలైనపుడు ఇది శ్రీవిష్ణు సినిమా అని.. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ టైటిల్ రోల్ చేసింది రాజేంద్రుడని తర్వాత తెలిసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పుట్టడానికి ఆయన పాత్రే కారణం. ప్రోమోల్లో అంత బాగా హైలైట్ అయ్యారాయన. ఇక సినిమాలో కూడా ఆయనదే హవా. ఆరంభం నుంచి చివరి దాకా రాజేంద్ర ప్రసాద్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు.
ప్రథమార్ధమంతా ఆయన తన ‘ఫఫాఫిఫీ’ భాషతో నవ్వులు పంచి.. ద్వితీయార్ధంలో హృద్యమైన నటనతో ఏడిపించారు. హాలీవుడ్లో చూసే సర్వైవల్ సినిమాల తరహాలో నడుస్తుంది ‘గాలి సంపత్’ సెకండాఫ్‌లో. మాటలు లేకుండా కేవలం హావభావాలతో ప్రేక్షకులను కదిలించడంలో రాజేంద్ర ప్రసాద్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొడుక్కి తన పట్ల ఉన్న ద్వేషం తెలుసుకుని తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోలేని విధంగా ఆయన పెర్ఫామెన్స్ సాగింది. గాలి సంపత్ క్యారెక్టర్ కచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ కెరీర్లో ఒక మైలురాయి అనడంలో సందేహం లేదు.
This post was last modified on March 14, 2021 5:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…