#worstprosharathchandra.. బుధవారం ట్విట్టర్లో నేషనల్ లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతల గురించి పాజిటివ్, నెగెటివ్ ట్రెండ్స్ చేయడం మామూలే కానీ.. ఇలా ఒక సినిమా పీఆర్వో గురించి హ్యాష్ ట్యాగ్ పెట్టడం.. వేలల్లో ట్వీట్లు వేసి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేయడం విడ్డూరమే. ఈ పని చేస్తోంది తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు కావడం గమనార్హం. అజిత్ కొత్త సినిమా ‘వాలిమై’కు పీఆర్వోగా పని చేస్తున్న వ్యక్తే శరత్ చంద్ర. అతడి గురించే ఇలా నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు.
అజిత్ అభిమానులకు అంతగా కోపం తెప్పించే పని ఏం చేశాడు అంటారా.. ‘వాలిమై’ గురించి ఏ అప్‌డేట్ ఇవ్వకపోవడమే. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఏడాది దాటిపోయింది. కరోనా కంటే ముందే సినిమాను మొదలుపెట్టి దాదాపు సగం చిత్రీకరణ జరిపారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. జోరుగానే సాగుతోంది.
ఐతే సినిమా మొదలై ఇంత కాలం అయినా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడం అజిత్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం టైటిల్ లోగో కూడా వదల్లేదు. అసలు సినిమా గురించి ఫలానా టైంలో అప్‌డేట్ ఇస్తారన్న సమాచారం కూడా లేదు. ఇప్పటికి నాలుగైదు సార్లు ‘వాలిమై అప్‌డేట్ కావాలి’ అంటూ ట్రెండ్స్ చేశారు. సోషల్ మీడియాను హోరెత్తించారు.
మధ్యలో ఒకసారి నిర్మాత బోనీ కపూర్‌ను సైతం టార్గెట్ చేస్తే.. ఆయన సరైన సమయంలో అప్‌డేట్ వస్తుందని ఊరుకున్నారు. కానీ తర్వాత చప్పుడు లేదు. దీంతో ఇప్పుడు పీఆర్వోను టార్గెట్ చేశారు. అతడి పేరు తెలుసుకుని నెగెటివ్ ట్రెండ్ మొదలుపెడితే అజిత్ అభిమానులందరూ దిగిపోయారు. తమ ఆగ్రహాన్నంతా చూపిస్తూ పీఆర్వో మీద మీమ్స్, జోకులు పేలుస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకుమించి వారిని వెయిట్ చేయిస్తే చాలా కష్టం కాబట్టి ‘వాలిమై’ ఫస్ట్ లుక్ అతి త్వరలోనే చిత్ర బృందం రిలీజ్ చేయక తప్పదేమో.
This post was last modified on March 11, 2021 9:41 am
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి…
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…