టాలీవుడ్‌కు ఈసారి వేసవి కాస్త ముందే వచ్చింది. మామూలుగా మార్చి నెలాఖర్లో వచ్చే క్రేజీ మూవీస్‌తో వేసవి సందడి మొదలవుతుంది. కానీ ఈసారి మాత్రం మార్చి రెండో వారంలోనే బాక్సాఫీస్ దగ్గర హంగామా కనిపిస్తోంది. కరోనా కారణంగా గత ఏడాది చాలా కాలం థియేటర్లు మూతపడటంతో కొత్త ఏడాదిలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు.
దీంతో అన్ సీజన్లోనూ సినిమాలు పెద్ద ఎత్తున వరుస కడుతున్నాయి. మంచి సినిమాలకు వసూళ్ల మోతా మోగుతోంది. ఈ ఆశతోనే ఈ వారం మూడు పేరున్న సినిమాలను విడుదల చేస్తున్నారు. ఆ మూడూ ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాలే. విభిన్నమైన కథలతో తెరకెక్కినవే. మూడు చిత్రాల మీదా మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ వారం రానున్న మూడు చిత్రాల్లో ముందు చిన్నదిగా కనిపించింది.. ఇప్పుడు అన్నింట్లోకి ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నది జాతిరత్నాలు సినిమానే. ఈ చిత్రానికి విడుదల ముంగిట అనూహ్యమైన హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరు మీదున్నాయి. తొలి రోజు ఈ సినిమా ప్యాక్డ్ హౌసెస్‌తో నడవబోతోంది. మరి ఈ హైప్‌కు తగ్గట్లుగా సినిమా ఉంటుందేమో చూడాలి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తున్న ఈ చిత్రం వీకెండ్లో బాక్సాఫీస్ లీడర్‌గా నిలవడం ఖాయం. తర్వాత ఎలా ముందుకెళ్తుందన్నది టాక్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇక శర్వానంద్ నటించిన శ్రీకారం మీద అంచనాలు బాగానే ఉన్నాయి కానీ.. జాతిరత్నాలుతో పోటీ దీనికి ప్రతికూలంగా మారింది. ఆ సినిమా దూకుడు వల్ల దీనికి అనుకున్న స్థాయిలో బుకింగ్స్ లేవు. ఐతే వ్యవసాయం నేపథ్యంలో ఒక ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని, పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఇక రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషించిన గాలి సంపత్ కాన్సెప్ట్ పరంగా కొత్తగానే అనిపిస్తోంది. కానీ మిగతా రెండు సినిమాల ముందు ఇది ఏమేర నిలుస్తుందన్నది టాక్ మీద ఆధారపడి ఉంది. మరి ఈ మూడు చిత్రాలకు గురువారం ఎలాంటి టాక్ వస్తుందో.. బాక్సాఫీస్ దగ్గర వాటి పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on March 11, 2021 9:47 am
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…