Movie News

అల్లు అర్జున్‌పై పంచులే పంచులు

అల్లు అర్జున్‌ను ఆయన అభిమానులు సోషల్ మీడియా కింగ్ అని అభివర్ణిస్తుంటారు. పీఆర్ టీంను మెయింటైన్ చేయడంలో, సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకోవడంలో, అక్కడ ఫాలోయింగ్ పెంచుకోవడంలో బన్నీకి బన్నీనే సాటి అని ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటుంటారు. హీరోగా బన్నీ పడే కష్టం, అతడి పెర్ఫామెన్స్, సినిమాల ఎంపిక.. ఇలాంటి విషయాల్లో తిరుగులేదు కానీ, బయట బన్నీ తీరు, ఆయా సందర్భాల్లో అతడికి పీఆర్ టీం ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేసే విధానం మాత్రం కొంత అభ్యంతరకరగానే ఉంటుంది.

దీని మీద సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతుంటుంది. ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్ దగ్గర్నుంచి మెగా అభిమానుల నుంచే అతను వ్యతిరేకత ఎదుర్కొంటూ వచ్చాడు. అలాగే ఎదిగే దశలో ‘మెగా’ బ్రాండును బాగా వాడుకుని ఈ మధ్య ‘అల్లు’ బ్రాండుకు మాత్రమే ఎలివేషన్ ఇస్తుండటమూ ఓ వర్గానికి నచ్చట్లేదు.

ఇదిలా ఉంటే సినిమా వేడుకల్లో బన్నీ ప్రసంగాలు.. ఆ సమయాల్లో సభా ప్రాంగణంలో అతడి అభిమానుల హంగామా సైతం చర్చనీయాంశం అవుతుంటుంది. తాజాగా బన్నీ ముఖ్య అతిథిగా హాజరైన ‘చావు కబురు చల్లగా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఓ పరిణామం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బన్నీ కోసం అభిమానులు పైకి రావడం.. అతడి మీద పడిపోవడం.. బన్నీ వాళ్లనేమీ అనొద్దు అంటూ వారించడం.. ఇదంతా కూడా ఒక సెటప్ లాగా అనిపించింది జనాలకు.

అనుకోకుండా జరిగిన పరిణామంలా కాకుండా.. బన్నీ క్రేజ్ చూపించడానికి ప్లాన్ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులను బన్నీ బౌన్సర్లే పైకి తీసుకురావడం.. అదే సమయంలో కింద ఒక బ్యాచ్ ముందుకొచ్చి బన్నీని ఫొటోలు తీయడానికి ప్రయత్నించడం.. ఇదంతా సహజంగా జరిగినట్లయితే అనిపించలేదు. గతంలోనూ కొన్నిసార్లు అభిమానులు వేదిక మీదికి రావడం, వాళ్లనేమీ అనొద్దని బన్నీ వారించడం జరిగాయి. ఈసారి మాత్రం పనిగట్టుకుని ఇలా చేయించినట్లు అనిపించడంతో బన్నీ అండ్ టీమ్ మీద సోషల్ మీడియాలో బోలెడన్ని జోకులు పేలుతున్నాయి. మీమ్స్ పడుతున్నాయి.

This post was last modified on March 10, 2021 6:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

8 minutes ago

బాలయ్య హిందీ, తమిళంలోనూ ఇరగదీస్తున్నాడుగా

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ‌-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…

25 minutes ago

భాగ్యశ్రీని అలా అనడం కరెక్టేనా?

సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…

56 minutes ago

అఖండ ప్లానింగ్… అక్క‌డ సూప‌ర్… కానీ ఇక్క‌డ‌?

పెద్ద సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల‌స్యం కావ‌డం ఇటీవ‌ల పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు…

1 hour ago

అధికారం వచ్చి ఎన్ని నెలలు అయినా ప్రజల మధ్యే సీఎం

అధికారంలోకి రాక‌ముందు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వ‌చ్చిన త‌ర్వాత కూడా నిరంత‌రం ప్ర‌జ‌ల‌ను…

2 hours ago

డాలర్ @ 90: మీ జేబుకు చిల్లు పడేది ఎక్కడో తెలుసా?

"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…

2 hours ago