మే నెల అంటే సినిమాలకు అత్యంత అనుకూలమైన నెల. అన్ని తరగతుల విద్యార్థులూ ఆ నెలలో ఖాళీ అయిపోతారు. ఎండలు పతాక స్థాయికి చేరుకునే మే నెలలో మామూలు జనం కూడా థియేటర్లకు వెళ్లి ఉపశమనం పొందాలని చూసే నెల ఇది. అందుకే ప్రతి ఏడాదీ ఈ నెలలో భారీ సినిమాలు వరుస కడుతుంటాయి. కానీ ఈ ఏడాది కరోనా పుణ్యమా అని థియేటర్లు మూతబడటంతో సినిమాల రిలీజే లేకపోయింది.
మామూలుగా అయితే మాత్రం మే నెల కొత్త సినిమాలతో చాలా సందడిగా ఉంటుంది. మే నెలలో సక్సెస్ రేట్ ఎక్కువ కాగా.. ఈ నెలలో తొమ్మిదో తారీఖున వస్తే మరింత మంచి ఫలితం ఉంటుందనే నమ్మకం సినీ జనాల్లో ఉంది. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒకటైన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలైంది మే 9నే కావడం ఇక్కడ ముందుగా ప్రస్తావించాల్సిన విషయం.
1989 ద్వితీయార్ధంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పట్టాలెక్కగా.. చాలా ముందుగానే నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే, రిలీజ్ టైంలో తుపాను ఇబ్బంది పెట్టినా ఆ తేదీనే రిలీజ్ చేశారు. ఆ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత ఏడేళ్లకు మే 9న మరో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. అదే.. ప్రేమించుకుందాం రా.
ప్రేమకథా చిత్రాల్లో అదొక ట్రెండ్ సెట్టర్. వెంకటేష్ కెరీర్లోనే అప్పటికది బిగ్గెస్ట్ హిట్. కట్ చేస్తే గత రెండేళ్లలో కూడా మే 9న రెండు స్పెషల్ మూవీస్ వచ్చాయి. ఆ తేదీకి ప్రత్యేకతను చేకూర్చాయి. 2018 మే 9న ‘మహానటి’ సినిమా రిలీజైంది. దాని నిర్మాత కూడా అశ్వినీదత్‌యే. ఆయన సంస్థకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వైభవాన్ని తీసుకొచ్చిన చిత్రమిది. ఇక గత ఏడాది ఇదే తేదీన మహేష్ బాబు సినిమా ‘మహర్షి’ విడుదలైంది. డివైడ్ టాక్‌ను తట్టుకుని కూడా ఆ సినిమా మంచి విజయాన్నందుకుంది. విశేషం ఏంటంటే.. ఇందులో కూడా దత్ నిర్మాణ భాగస్వామి.
This post was last modified on May 9, 2020 5:19 pm
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…