యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న, నటించబోయే చిత్రాల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్నది నాగ్ అశ్విన్‌తో చేయబోయే సినిమానే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. మహానటి లాంటి గొప్ప సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తీయబోయే చిత్రమిది. పైగా వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్ పెడుతోందీ చిత్రానికి. అలాగే ఆదిత్య 369 తరహాలో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా, హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమాను తీర్చిదిద్దనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
ఇండియన్ సినిమాలో ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుందనే అంచనాలు దీనిపై ఉన్నాయి. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఊరిస్తూ.. కొత్త కబుర్లు చెబుతూనే ఉన్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తాజాగా తన నిర్మాణంలో తెరకెక్కిన జాతిరత్నాలు ప్రమోషన్ కోసం మీడియాను కలిసిన అశ్విన్.. ప్రభాస్‌తో చేయబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ప్రభాస్‌తో తాను చేయనున్న సినిమాను గత ఏడాది జూన్‌లోనే మొదలుపెట్టాలని ముందు అనుకున్నట్లు నాగి వెల్లడించాడు.కానీ కరోనా వల్ల కొంత ఆలస్యమైతే.. ప్రి ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టేలా ఉండటంతో ఇంకా లేటుగా సినిమాను మొదలు పెడుతున్నామని చెప్పాడు. ఏడాదికి పైగా ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ కోసమే కేటాయిస్తున్నామని.. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సి ఉందని నాగి తెలిపాడు.
మహానటి సినిమాలో వాడిన పాత కార్లు లాంటివి తెప్పించడం పెద్ద కష్టం కాదని.. కానీ ప్రభాస్‌తో తాను చేయబోయే సినిమాలో వాడే వాహనాలు ఎక్కడా దొరకవని.. వాటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నామని నాగి తెలిపాడ. వాహనాలు అనే కాదు.. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ ఆర్ట్ డిపార్ట్ మెంట్ తయారు చేయిస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమా స్క్రిప్ట్ సహా ప్రతిదీ కొత్తగానే ఉంటుందని.. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తామని నాగి చెప్పాడు.. ఈ ఏడాది జూన్-జులై నెలల్లో ఈ చిత్ర తొలి షెడ్యూల్ మొదలుపెట్టాలనుకుంటున్నట్లు అతను వెల్లడించాడు.
This post was last modified on March 8, 2021 12:16 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…