ఏ బ్యాగ్రౌండూ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. నటుడిగా చిన్న చిన్న సినిమాలు, పాత్రలతో మొదలుపెట్టి తన కష్టంతో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన నటుడు చిరంజీవి. ఒక స్థాయి అందుకున్నాక చాలామంది రిలాక్స్ అయిపోతారు కానీ.. చిరు మాత్రం ఇంకా ఉన్నత స్థాయిని అందుకోవడానికి, తనపై అభిమానుల్లో నెలకొన్న అంచనాలను అందుకోవడానికి పడ్డ కష్టం ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఎవ్వరూ అందుకోలేని స్థితికి చేర్చింది.
పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి తిరిగొస్తూ ‘ఖైదీ నంబర్ 150’ సినిమా కోసం ఆయన తయారైన విధానం.. అందులో ఎంతో హుషారుగా డ్యాన్సులు, ఫైట్లు చేసిన వైనం చూసి జనాలు అబ్బురపడ్డారు. ‘సైరా’ కోసం మరింతగా కష్టపడ్డ చిరు.. ప్రస్తుతం ‘ఆచార్య’లో వావ్ అనిపించే లుక్‌తో కనిపిస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత వేగం పెంచుతూ వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆయన కమిట్మెంట్ చూసి అచ్చెరువొందుతూ.. ‘ఆంధ్రాపోరి’, ‘రుషి’, ‘ఐతే 2.0’ చిత్రాల దర్శకుడు రాజ్ మాదిరాజు ఫేస్ బుక్‌లో ఒక ఆసక్తికర పోస్టు పెట్టాడు. అది చిరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ కమిట్మెంట్ ఎలాంటిదో తెలియజేస్తోంది. ఇంతకీ ఆ పోస్టు సారాంశమేంటో చూద్దాం పదండి.
‘‘చిరంజీవి అని ఇండస్ట్రీకి ఓ కొత్తబ్బాయొచ్చాడంట.. పొద్దున్నే నాలుగున్నరకి లేచి గంటన్నరసేపు జిమ్ములో కసరత్తులు చేస్తున్నాడంట.. నిన్ననే ఆచార్య అనే సినిమాకి గుమ్మడికాయ కొట్టేశాడంట.. మండే మార్చి, ఏప్రిల్, మే ఎండల్లో ఒక సినిమా షూటింగుకి డేట్లిచ్చాడంట.. జూనొదిలేసి జూలై, ఆగస్టు, సెప్టెంబరు రెండోది, అక్టోబరునుంచి క్రిస్మస్‌లోగా మరోటి షూటింగు ఫినిష్ చేయాలని ప్లానింగంట.. పారలల్‌గా రైటర్లతో కథాచర్చల్లో.. కూర్చుంటే పన్నెండు పద్నాలుగు గంటలపాటు నాన్‌స్టాప్ కొట్టేస్తన్నాడంట.. షాటు పూర్తయాక సెట్టులోనే కుర్చీ వేసుక్కూర్చుంటన్నాడంట.. క్యారవానెక్కి కూర్చునే పనే లేదంట.. మిగతా యాక్టర్లందరూ చచ్చుకుంటూ పక్కనే కూర్చుని షాటుకోసం వెయిటింగంట.. బాబూ చిరంజీవీ.. నచ్చావోయ్.. యేడాదికి మూడు సినిమాలు షూటింగు అలవోకగా ఫినిష్ చేసి రిలీజు చేయగలిగిన దమ్మున్నోడివి గాబట్టి కాదూ.. అరవయ్యయిదొచ్చినా ఇరవయ్యయిదేళ్లవాడిలా కష్టపడతావని, ప్రొఫెషనలిజంకి పెద్దపీట వేస్తావనీ కాదూ.. కథానాయకుడిగానే కాదు కష్టకాలంలో ఇండస్ట్రీకి నాయకుడిగా బై ఎగ్జాంపుల్ ముందుండి నడిపిస్తావని కాదూ.. ఇందుక్కాదూ మెగాస్టారయింది నువ్వు.. ఆచార్యా.. టేకెబౌ’’
ఇదీ రాజ్ మాదిరాజు పెట్టిన పోస్టు. మెగాస్టార్ ఈ వయసులో పడుతున్న కష్టం, చూపిస్తున్న కమిట్మెంట్ గురించి ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు?
This post was last modified on March 6, 2021 5:07 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…