టాలీవుడ్లో కార్లంటే మహా మోజున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. మార్కెట్లోకి లగ్జరీ కారు వచ్చిందంటే అతడి కళ్లు దానిపై పడిపోతాయని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. తాజాగా అతను ఏకంగా రూ.5 కోట్ల ధరతో ఓ కారును కొన్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. లాంబర్గిని ఉరుస్ మోడల్ కారును అతను ఇటలీ నుంచి ఆర్డర్ చేశాడట.
ట్యాక్సులతో కలిపితే ఇండియాలో వచ్చి ఆ కారు దిగేసరికి దాని ధర రూ.5 కోట్లు అవుతుందట. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఇప్పటిదాకా ఈ మోడల్ కారును వాడలేదని, ఇండియాలో ఉన్న మోస్ట్ లగ్జీరియస్ కార్లలో ఇదొకటి అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే ఇలాంటి లగ్జరీ కార్లు మరికొన్ని ఉన్నాయి. ఐతే వాటిలో లేని ఫీచర్స్, కంఫర్ట్ ఈ కారులో ఉంటుందని అంటున్నారు.
దీని ఫీచర్ల గురించి ఆల్రెడీ టాలీవుడ్లో ఒక చర్చ మొదలైపోయింది. కారు మొదలైన 3.6 సెకన్లలోనే టాప్ స్పీడ్ 190 కిలోమీటర్లను అందుకుంటుందట. దీని ఇంజిన్ ఇతర విశేషాల గురించి కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్‌కు కార్లంటే ఎంతిష్టమో కొన్ని సందర్భాల్లో అభిమానులు కూడా చూశారు. కొన్నేళ్ల కిందట రామ్ చరణ్ ఒక లగ్జరీ కారు కొంటే అతడితో కలిసి ఆ కార్లో కూర్చుని డ్రైవ్ చేసి ముచ్చట తీర్చుకున్నాడు తారక్. అతను కారు ఎక్కితే స్పీడు మామూలుగా ఉండదంటూ పూరి జగన్నాథ్ సహా చాలామంది ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను అతడికి భారీగానే పారితోషకం అందుతోంది. ఈ సినిమాతో తన కెరీర్ మారిపోతుందని ఆశిస్తున్న తారక్.. ఈ చిత్రం పూర్తవుతున్న దశలో తనకు తాను పెద్ద గిఫ్ట్ ఇచ్చుకున్నట్లున్నాడు.
This post was last modified on March 3, 2021 2:45 pm
కరోనా దెబ్బకు ఆల్రెడీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏవైనా పెద్ద, ఈవెంట్ సినిమాలు రిలీజైనపుడే థియేటర్లు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…
రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…