ఒక టైంలో ఇండియాలో స్పోర్ట్స్ బయోపిక్స్‌కు భలే డిమాండ్ ఏర్పడింది. పాన్ సింగ్ తోమర్, బాగ్ మిల్కా బాగ్, ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ లాంటి సినిమాలు చాలా బాగా ఆడి ఈ జానర్‌కు ఊపు తెచ్చాయి. ఆ క్రమంలోనే వరుసగా స్పోర్ట్స్ బయోపిక్స్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్లయిన సైనా, సింధు, మిథాలీ రాజ్‌లతో పాటు కోచ్ గోపీచంద్ మీదా సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటనలు వచ్చాయి. కానీ ఇవన్నీ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేకపోయాయి.
సైనా బయోపిక్‌ను శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశారు. కారణాలేంటో కానీ.. శ్రద్ధ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సైనా బయోపిక్ వర్కవుట్ కాదేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ తర్వాత సైనా పాత్ర చేయడానికి పరిణీతి చోప్రా ముందుకొచ్చింది. అంత వరకు మాత్రమే సమాచారం వచ్చింది తప్ప.. ఈ సినిమా మొదలైందా లేదా అన్న క్లారిటీ కూడా లేదు.
ఐతే ఇప్పుడు హఠాత్తుగా సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం. ‘సైనా’ పేరుతో పరిణీతి లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26నే విడుదల కాబోతుండటం విశేషం. షటిల్ కాక్ రూపంలో టైటిల్ లోగో డిజైన్ చేసి.. చేతికి భారత త్రివర్ణ పతాకం రంగుల్లో ఉన్న బ్యాండ్ వేసుకుని సర్వీస్ చేస్తున్నట్లుగా తీర్చిదిద్దిన ప్రి లుక్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ‘ఎన్ ఇన్‌క్రెడిబుల్ ట్రూ స్టోరీ’.. ‘మార్ దోంగి’ అంటూ ఈ సినిమాకు క్యాప్షన్లు కూడా జోడించారు. హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి అయిన సైనా.. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో వచ్చి స్థిరపడటంతో ఇక్కడే బ్యాడ్మింటన్‌లోకి అడుగు పెట్టింది.
ఆటగాడిగా కెరీర్ ముగించాక కోచ్‌గా మారిన గోపీచంద్ శిక్షణలో ఆమె ఈ ఆటలో నైపుణ్యం సంపాదించింది. భారత బ్యాడ్మింటన్లో ఎవరూ చూడని ఎత్తులకు ఆమె చేరుకుంది. ఇప్పుడు సింధు సహా ఎంతోమంది క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్నారంటే అందుకు సైనా అందించిన స్ఫూర్తి ముఖ్య కారణం. మరి ఆమె కథను ఎంత ఆసక్తికరంగా వెండితెరపై ప్రెజెంట్ చేశారో చూడాలి. ఈ చిత్రానికి అమోల్ గుప్తే ద్శకత్వం వహించాడు.
This post was last modified on March 2, 2021 1:58 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…