Movie News

అర్జున్ రెడ్డి దర్శకుడు అప్పటిదాకా రాడు


‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై మూడున్నరేళ్లు దాటిపోయింది. ఆ సినిమాతో ఒక్కసారిగా తనపై అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పటిదాకా తెలుగులో మరో సినిమా చేయలేదు. కనీసం కమిట్మెంట్ కూడా ఇచ్చినట్లు కనిపించలేదు. అతడితో పని చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు ఆసక్తితో ఉన్నారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ కోసం రెండేళ్లకు పైగా వెచ్చించిన సందీప్.. బాలీవుడ్లోనే తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది.

ఐతే రణబీర్ కపూర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి పర్వాలేదులే అనుకున్నారు. ఐతే ఈ సినిమానైనా త్వరగా పూర్తి చేసి 2021 చివర్లోనో 2022 ఆరంభంలోనో తెలుగులో కొత్త సినిమాను మొదలుపెడతాడేమో అని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అతను 2022లో కూడా మళ్లీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదు.

రణబీర్‌తో సందీప్ చేయనున్న ‘అనిమల్’ సినిమా ఇప్పుడిప్పుడే విడుదల కాబోవట్లేదు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు ఫిక్స్ చేశారు. సందీపే స్వయంగా ట్విట్టర్ ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించాడు. అంటే సినిమాను ప్రకటించిన రెండేళ్లకు కానీ ఇది రిలీజవ్వదన్నమాట. అప్పటిదాకా సందీప్ వేరే ప్రాజెక్టు గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇక ఈ సినిమా రిలీజయ్యాక కొత్త సినిమా చర్చలు మొదలుపెట్టి దాన్ని ప్రకటించేసరికి 2023 వచ్చేస్తుందేమో.

ఒకవేళ ‘అనిమల్’ బాగా ఆడి బాలీవుడ్లో ఇంకా డిమాండ్ పెరిగిపోతే సందీప్.. అక్కడే మరో పెద్ద హీరోతో తన తర్వాతి సినిమాను సెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ నుంచి వచ్చే సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మళ్లీ సందీప్-విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తారని సంకేతాలు వచ్చాయి కానీ.. అదెప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి.

This post was last modified on March 1, 2021 1:33 pm

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

36 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago