బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల లిస్టు తీస్తే అందులో టాప్-10లో నిలిచే హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. వీళ్లిద్దరూ కొన్ని సమయాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హోదాలోనూ కొనసాగారు. ఈ మధ్య షారుఖ్ హవా తగ్గింది కానీ.. ఒకప్పుడు అతను బాలీవుడ్ ‘కింగ్’. ఇక సల్మాన్ ఒక మూణ్నాలుగేళ్లు మినహాయిస్తే ఎప్పుడూ టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగుతూనే ఉన్నాడు.
ప్రస్తుతం వీళ్లిద్దరి ఫామ్ ఏమంత గొప్పగా లేదు. షారుఖ్ వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతుంటే.. సల్మాన్ కూడా స్థాయికి తగ్గ విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ‘రాధె’లో నటిస్తుండగా.. షారుఖ్ తన తర్వాతి సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. ఐతే త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారన్నది బాలీవుడ్ మీడియా వర్గాల తాజా సమాచారం.
‘ధూమ్-2’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నిఖిల్ అద్వానీ వీళ్లిద్దరి కలల కాంబినేషన్‌ను మళ్లీ తరపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఖాన్‌లిద్దరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నిఖిల్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌కు స్క్రిప్టు రెడీ చేశాడని.. సల్మాన్, షారుఖ్ ఓకే చెబితే ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కుతుందని.. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించవచ్చని అంటున్నారు.
ఈ వార్త నిజమే అయితే మాత్రం హిందీ ప్రేక్షకుల ఆనందానికి అవధులువండవు. ఇంతకుముందు షారుఖ్, సల్మాన్ కలిసి ‘కరణ్ అర్జున్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘హమ్ తుమారే హై సనమ్’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ లాంటి సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లలో సల్మాన్ మూవీ ‘ట్యూబ్ లైట్’లో షారుఖ్ క్యామియో రోల్ చేస్తే..షారుఖ్ మూవీ ‘జీరో’లో సల్మాన్ తళుక్కుమన్నాడు. ఐతే వీళ్లిద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్ చేసి మాత్రం చాలా కాలం అయిపోయింది.
This post was last modified on April 9, 2020 6:23 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…