తెలుగు సినిమాలపై హీరోయిన్ తండ్రి కామెంట్స్!

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు చిత్ర సీమలో పలు చిత్రాలు చేసేసింది. హలో, చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో నటించిన కళ్యాణి తెలుగులో చేసిన సినిమాలు తనకు అంతగా నచ్చలేదని ఆమె తండ్రి చెప్పారు.

ఆమె నటన కూడా అంతగా నచ్చలేదని, అదే మలయాళంలో ఆమె చేసిన వరనే ఆవశ్యముండు చిత్రంలో తన నటన మెప్పించింది ఈ సీనియర్ దర్శకుడు చెప్పారు. మలయాళీ అయినా కూడా తెలుగులో కల్యాణికి బాగానే అవకాశాలు వచ్చాయి కానీ ఇక్కడంతగా సక్సెస్ రాలేదు.

కూతురి సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోనని, కానీ ఆమె చేసిన సినిమాలు చూసి ఫీడ్ బ్యాక్ ఇస్తుంటానని ప్రియదర్శన్ చెప్పారు. తెలుగులో నాగార్జునతో నిర్ణయం సినిమా తీసింది ఈయనే.