విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన చంద్రశేఖర్ యేలేటి నుంచి వచ్చిన కొత్త సినిమా చెక్. శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలో దిగింది. యేలేటి సినిమా అంటే ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి గురి ఉంటుంది. వాళ్లు పరుగెత్తుకుని సినిమాకు వచ్చేస్తారు. భారీ అంచనాలతో ఆయన సినిమా చూస్తారు. సాధారణ ప్రేక్షకులు చెక్ పర్వాలేదని, చల్తా అని అంటుంటే.. యేలేటి అభిమానులే ఈ సినిమా పట్ల ఎక్కువగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఎందుకంటే ఆయనపై వారకున్న అంచనాలు అలాంటివి. ఐతే, అనుకోకుండా ఒక రోజు లాంటి చిత్రాలతో యేలేటి కెరీర్ ఆరంభంలోనే తనపై అంచనాలు బాగా పెంచేశాడు. స్క్రీన్ ప్లే విషయంలో మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఏం తీసినా ఒరిజినల్‌గా ఉంటుందని, కాపీకి ఛాన్సే ఉండదని బలంగా నమ్ముతారు యేలేటి అభిమానులు.
ఇలాంటి దర్శకుడు చెక్ సినిమా క్లైమాక్స్ విషయంలో హాలీవుడ్ క్లాసిక్ శ్వశాంక్ రిడెంప్షన్‌ను ఫాలో అయిపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ సినిమాలో ఈ ట్విస్ట్ ప్రేక్షకులను బాగానే థ్రిల్ చేస్తుంది. ఇలాంటి క్లైమాక్స్ ఊహించరు. కానీ శ్వశాంక్ రిడెంప్షన్ చూసిన వాళ్లకు మాత్రం ఆ సినిమా క్లైమాక్స్‌ను యేలేటి కాపీ కొట్టేశాడనే అనిపిస్తుంది. ఎందుకంటే అందులోనూ హీరో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. చివర్లో ఎవరూ ఊహించనిది చేస్తాడు.
చెక్ కథ, క్లైమాక్స్ ట్విస్టు దానికి దగ్గరగా ఉండటం యేలేటి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో పేరులేని సినిమా నుంచి ఐడియా తీసుకున్నా ఓకే కానీ.. ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒకటిగా పేరున్న సినిమా నుంచి ఆయన కాపీ కొట్టడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ క్వీన్స్ గాంబెట్‌తోనూ చెక్‌కు కొంచెం పోలికలు కనిపించాయి.
This post was last modified on February 27, 2021 10:17 am
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…