యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నట్లు బలంగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ‘బిగ్ బాస్’ షో తొలి సీజన్‌ను తారక్ ఎంత బాగా నడిపించాడో.. ఆ షోకు ఎలా ఆకర్షణకు మారాడో తెలిసిందే. ఇప్పటికీ ‘బిగ్ బాస్’ ప్రియులు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ను గుర్తు చేసుకుని అతను మళ్లీ ఈ షోలో పాల్గొంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు.
ఐతే తర్వాతి సీజన్లలోనూ ఎన్టీఆర్‌ను సంప్రదించినా అతను.. మళ్లీ ఆ షోను హోస్ట్ చేయడానికి అంగీకరించలేదు. ఐతే ఇప్పుడు మరో పేరున్న షోతో తారక్ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేసి, మధ్యలో ఆగిపోయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో పున:ప్రారంభం కానుందని, తారక్ దాని కొత్త సీజన్‌ను హోస్ట్ చేయబోతున్నాడని సమాచారం.
ఇప్పటికే తారక్‌ను పెట్టి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోమోను కూడా షూట్ చేశారని, దాన్ని అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్ ఆరంభం కానుందట. తారక్ మీద ప్రోమో తీసింది అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం విశేషం. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో తారక్ మీద త్రివిక్రమ్ ఒక యాడ్ షూట్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ అది యాడ్ షూట్ కాదని.. ‘ఎంఈకే’ ప్రోమో అని అంటున్నారు.
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను నాగార్జున హోస్ట్ చేసినపుడు మంచి రేటింగ్సే వచ్చాయి. ఈ షో బాగానే నడిచింది. ఐతే ఉన్నట్లుండి ఆయన ఈ షో నుంచి తప్పుకున్నారు. చిరంజీవి హోస్ట్ చేసిన తర్వాత సీజన్‌కు ఆశించినంత స్పందన రాలేదు. ఐతే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ నాగార్జున చేతికి వెళ్లగా.. ఇప్పుడు ‘ఎంఈకే’ తారక్ చేతుల్లోకి వచ్చిందన్న వార్త ఆసక్తి రేకెత్తించేదే. ఈ షో జెమిని టీవీలో ప్రసారం కాబోతోంది.
This post was last modified on February 26, 2021 6:38 pm
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…