టాలీవుడ్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో నితిన్ ఒకడు. తొలి సినిమా ‘జయం’ నుంచి మొదలుపెడితే అతడి కెరీర్లో ఎక్కువగా చేసిన సినిమాలు ప్రేమకథలే. త్వరలో రాబోతున్న ‘రంగ్ దె’ సైతం లవ్ స్టోరీనే అన్న సంగతి తెలిసిందే. నితిన్‌కు పెద్దగా వయసేమీ అయిపోలేదు. లుక్స్ పరంగా కూడా ఇంకా కొన్నేళ్లు లవర్ బాయ్ పాత్రలు చేయడానికి ఇబ్బందేమీ లేదు. కాబట్టి అతడి నుంచి మరిన్ని ప్రేమకథలు వస్తాయనే అనుకుంటున్నారంతా. కానీ నితిన్ మాత్రం ఇకపై ప్రేమకథలు చేయను అనేశాడు. ‘రంగ్ దె’నే తన చివరి లవ్ స్టోరీ అని అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చేయడం గమనార్హం.
ఇందుకు కారణం చెబుతూ.. ‘‘సినీ పరిశ్రమలోకి వచ్చి 19 ఏళ్లవుతోంది. ఇంకా లవర్ బాయ్ అనిపించుకోవడం కరెక్ట్ కాదు అనిపిస్తోంది. కెరీర్లో ఎక్కువగా ప్రేమకథలే చేశా. కాబట్టి ‘రంగ్ దె’ నా చివరి ప్రేమకథ అవుతుంది’’ అని నితిన్ అన్నాడు. ఐతే కొంచెం సీరియస్‌గానే ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ.. ఈ మాట మీద నితిన్ ఎంత సీరియస్‌గా నిలబడతాడో చూడాలి.
ఇక తాను చేస్తున్న, చేయబోయే సినిమాల గురించి నితిన్ వివరిస్తూ.. వచ్చే నెల 26న విడుదల కావాల్సిన ‘రంగ్ దె’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుందని, అనుకున్న ప్రకారమే ఆ సినిమా రిలీజవుతుందని.. ‘అంధాదున్’ రీమేక్ సగం పూర్తయిందని చెప్పాడు. మేలో తన కొత్త చిత్రం ‘పవర్ పేట’ మొదలవుతుందని.. కుదిరితే ఆ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలన్నది ప్రణాళిక అని.. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘చెక్’తో కలుపుకుంటే ఈ ఏడాది తన సినిమాలు నాలుగు రిలీజవుతాయని నితిన్ తెలిపాడు.
‘పవర్ పేట’ తన కెరీర్లనే అత్యంత కష్టంతో, సవాళ్లతో కూడుకున్న సినిమా అని.. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తాను 20, 40, 60 ఏళ్ల వయసుల్లో కనిపించే వ్యక్తిగా నటించనున్న సంగతి నిజమే అని.. ఆ సినిమా కోసం మేకప్ పరంగా ప్రయోగాలు చేయబోతున్నామని నితిన్ వెల్లడించాడు. భవిష్యత్తులో మల్టీస్టారర్లు చేసే ఉద్దేశముందా అని నితిన్‌ను అడిగితే.. తప్పకుండా చేస్తానని, తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలని ఉందని నితిన్ చెప్పాడు.
This post was last modified on February 25, 2021 12:15 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…