అల్లూరిసీతారామరాజు.. సూపర్ స్టార్ క్రిష్ణ నటజీవితంలో ఒక మైలు రాయి.. డేషింగ్ అండ్ డేరింగ్ హీరో అని ఆయనను అంటారు కానీ ఆయన వెనుకవున్న డేషింగ్ నిర్మాత స్వయానా క్రిష్ణ తమ్ముడు జి ఆదిశేషగిరిరావు.. ఈ హనుమంతరావు కొంతకాలం మిలటరీ లో పని చేసి వచ్చారు.. క్రిష్ణ హీరోగా ఎదుగుతున్న క్రమం లో తానే పద్మాలయా సంస్థను స్థాపించి నిర్మాణ కార్య క్రమాలు తన ఇద్దరు తమ్ముళ్ళయిన హనుమంతరావు ఆదిశేషగిరిరావు కి అప్పగించారు.. చిన్నతమ్ముడు ఆదిశేషగిరిరావు ఆర్ధిక లావాదేవీ లు చూసుకునేవారు.. పెద్ద తమ్ముడు హనుమంతరావు నిర్మాణ బాధ్యతలు చూసుకునేవారు.. మిలటరీ నుండి వచ్చిన వ్యక్తి కావడం వలన అన్ని పనులు పద్దతి ప్రకారం క్రమశిక్షణ గా జరిపేవారు..
మోసగాళ్లకు మోసగాడు షూటింగ్ ధార్ ఎడారిలో షూటింగ్ చేయాలంటే ముందే వెళ్లి లొకేషన్ పర్మిషన్ తెప్పించి యూనిట్ కి కావలసిన వసతులు అన్నీ కల్పించి తరువాత యూనిట్ ని తీసుకుని వెళ్లేవారు.. కురుక్షేత్రం షూటింగ్ జైపూర్ లో ప్లాన్ చెస్తే మద్రాస్ నుండి జైపూర్ కి ఒ
క స్పెషల్ ట్రైన్ వేయించుకుని … ఆర్టిస్ట్స్ లకు చీఫ్ టెక్నీషియన్ లకు రెండు ఫస్ట్ క్లాస్ బోగీలు..
మామూలు టెక్నీషియన్స్.. జూనియర్ ఆర్టిస్ట్స్ కోసం మూడు త్రీ టైర్ బోగీలు.. గుర్రాలు స్పెషల్ ప్రాపర్టీస్ కోసం రెండు (గూడ్స్ )ఓపెన్ బోగీలు.. దానిలో అందర్నీ తీసుకుని వెళ్లి షూటింగ్ చేయించారు.. ఇక అల్లూరి సీతారామరాజు విషయానికి వస్తే చింతపల్లి ఫారెస్ట్ లో ఒక మినీ విలేజ్ కన్ స్ట్రక్ట్ చేశారు.. ఆర్టిస్ట్స్.. చీఫ్ టెక్నీషియన్స్ కి సెమీ పర్మినెంట్ కాటేజిలు.. మిగతావారికి డార్మెటరీలు తయారు చేయించి ముప్పై రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేయించారు..
పెట్రోల్ కోసం ప్రతిరోజూ నర్శిపట్నం వెళ్లకుండా డీజిల్ పెట్రోల్ ముందే తెప్పించి డ్రమ్స్ లో స్టోర్ చేయించి ఉదయం నాలుగు గంటలకే వెహికిల్స్ లో ఫ్యూయల్ ఫీల్ చేయించేవారు…ఇంకో ముఖ్యమైన విషయం… ఎవరెవరు ఏ డ్రింక్ తీసుకుంటారో తెలుసుకుని అన్నీ మద్రాస్ నుండే తీసుకెళ్లి ప్రతిరోజు ఎవరికి కావాల్సిన మందు వారికి చేరేలా ఏర్పాటు చేశారు..ప్రతిరోజూ మందు వెతుక్కునే విషయంలో వాళ్ళ టైమ్ వెస్ట్ కాకుండా వుండాలని ఉదయం ఆరుగంటలకు షూటింగ్ జరగడం కోసం ఇలా చేసేవారు…. మెయిన్ ఆర్టిస్ట్ లు గుమ్మడి..
ప్రభాకరరెడ్డి.. బాలయ్య.. రావు గోపాలరావు లకు సినిమాలో వాళ్ళు వాడే ఆయుధాలు వాళ్ళకే ఇచ్చి మరుసటి రోజు షూట్ కి వాళ్ళే తెచ్చుకునేలా ఏర్పాటు చేశారు..సినిమాకి పని చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులకు రెండు మూడు తారీఖులలో జీతాలు అందేలా చూసేవారు.. పొరపాటున రెండు రోజులు లేట్ అయితే మేనేజర్ ని క్యాషియర్ ని విపరీతంగా తిట్టేవారు.. వాళ్ళతో మనం పనిచేయించుకుంటున్నాం.. వారికి డబ్బు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబ అవసరాలు తీరకుండా ప్రశాంతంగా ఎలా పని చేస్తారు అని అడిగేవారు.. అదీ ఆయన ప్లానింగ్.
ఆ సినిమా ఇప్పుడు తీయాలంటే కనీసం నూటయాభై రోజులు పడుతుంది.. ఈ సినిమా ప్రారంభానికి ముందు మద్రాస్ లో ‘దేవుడు చేసిన మనుషులు’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ని మద్రాస్ లో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాడు.. అవి అల్లూరి సీతారామరాజుని నడిపించిన మాజీ సైనికుడిని గురించిన విశేషాలు..
— శివ నాగేశ్వర రావు
This post was last modified on February 28, 2021 7:51 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…