కామెడీ వేషాలతో కెరీర్ బ్రహ్మాండంగా సాగిపోతున్న సమయంలో హీరోగా మారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సునీల్. మొదట్లో ఆ ప్రయత్నం మంచి ఫలితాలనే ఇచ్చింది. అందాల రాముడు, మర్యాదరామన్న, పూల రంగడు లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. సునీల్‌ను హీరోగా నిలబెట్టాయి. ఈ టైపు కామెడీ టచ్ ఉన్న సినిమాలే చేసుకుంటూ పోతే బాగానే ఉండేది.
కానీ తన అవతారం మార్చుకుని రెగ్యులర్ హీరోల్లా మాస్ సినిమాలు చేయాలని చూశాడు. డ్యాన్సులు, ఫైట్ల మీద మోజుతో గాడి తప్పాడు. కెరీర్‌ను చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. హీరోగా రెండంకెల సంఖ్యలో ఫ్లాపులు ఎదురవడం, ఒక దశ దాటాక అతడి సినిమాలను ప్రేక్షకులు పూర్తిగా పట్టించుకోవడం మానేయడంతో ఇక హీరో వేషాలకు స్వస్తి చెప్పక తప్పలేదు. ఆ తర్వాత మళ్లీ కామెడీ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ కూడా ట్రై చేశాడు. కానీ ఏవి కూడా పెద్దగా వర్కవుటైనట్లు కనిపించడం లేదు.
ఐతే ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో సునీల్‌కు వేషాలైతే ఆగట్లేదు. ప్రస్తుతం ‘ఎఫ్-3’ సహా రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సునీల్.. మళ్లీ హీరోగా ఓ సినిమాకు తయారైపోవడం విశేషం. ఇది తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కబోతుండటం గమనార్హం. ఈ చిత్రానికి ‘డీటీఎస్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
‘డేర్ టు స్లీప్’ అనేది ఈ టైటిల్ పూర్తి రూపం. చేతన్ అనే యంగ్ కన్నడ హీరో ఇందులో కీలక పాత్ర చేస్తున్నాడు. డోనల్, నటాషా అనే కొత్తమ్మాయిలు కథానాయికలుగా నటిస్తున్నారు. అభిరామ్ పిల్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ దీపాల నిర్మాత. సాయికార్తీక్ ‘డీటీఎస్’కు సంగీతం సమకూరుస్తున్నాడు. సునీల్‌కు హీరోగా తెలుగులోనే మార్కెట్ లేదంటే.. ఈ చిత్రాన్ని కన్నడలో కూడా తీయబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తనకు తానుగా హీరోగా సినిమాలు ఆపేసుకున్న సునీల్ కూడా ఏ ధైర్యంతో మళ్లీ లీడ్ రోల్‌లో సినిమా చేస్తున్నాడన్నదీ ప్రశ్నార్థకమే. మరి ‘డీటీఎస్’ అతడికెలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on February 24, 2021 5:02 pm
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…