కాజల్ అగర్వాల్‌కు హీరోయిన్‌గా ఒక గుర్తింపునిచ్చింది, స్టార్‌ను చేసింది తెలుగు ప్రేక్షకులే. ఇక్కడొచ్చిన పేరుతోనే ఆమె తమిళంలోనూ అవకాశాలు అందుకుంది. అక్కడా పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ఐతే దక్షిణాదిన ఎంత పేరు సంపాదించినా ఉత్తరాది భామలకు బాలీవుడ్లో వెలిగిపోవాలన్న కోరిక ఉంటుంది. కాజల్ కూడా అందుకు మినహాయింపు కాదు.
హిందీలో ఎప్పట్నుంచో ఆమె నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడ ఆమెకు స్పెషల్ చబ్బీస్, సింగం లాంటి హిట్లు కూడా ఉన్నాయి. కానీ అవేవీ కెరీర్‌కు ఊపు తీసుకురాలేదు. ఆ సినిమాల్లో కాజల్ పాత్ర నామమాత్రం. ఆమె హిందీలో చేసిన పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ మూవీ ‘దో లఫ్జోంకీ కహానీ’ నిరాశ పరిచింది. అయినా సరే.. బాలీవుడ్లో కాజల్ దండయాత్రం ఆగలేదు. తాజాగా ఆమె హిందీలో నటించిన కొత్త సినిమా.. ముంబయి సెగా. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది.
‘ముంబయి సెగా’ విషయంలో ముందు నుంచి కాజల్ ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. టీజర్ విషయంలోనూ హడావుడి చేసింది. తీరా చూస్తే నిమిషం పైగా నిడివి ఉన్న ఈ టీజర్లో కాజల్ ముఖం కూడా చూపించలేదు. బొంబాయి ముంబయిగా మారడానికి ముందు అక్కడ మాఫియా రాజ్యమేలుతున్న రోజుల్లో నడిచే కథ ఇది. బొంబాయిని గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక డాన్.. అతణ్ని ఆపడానికి ప్రయత్నించే ఓ పోలీస్.. ఈ ఇద్దరి మధ్య జరిగే వార్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని టీజర్ చూస్తే అర్థమైంది.
డాన్ పాత్రలో జాన్ అబ్రహాం నటిస్తే.. పోలీస్‌గా ఇమ్రాన్ హష్మి కనిపించాడు. సంజయ్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు మరో ముగ్గురు నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా కనిపించింది. జాన్, హష్మిలే హైలైట్ అయిన టీజర్లో వేరే పాత్రధారులు కొందరిని చూపించారు కానీ.. హీరోయిన్ కాజల్‌కు మాత్రం టీజర్లో చోటు లేకపోయింది. ఇందులో హీరోయిన్ పాత్ర నామమాత్రమే అని టీజర్ చూస్తే అర్థమైంది. మరి ట్రైలర్లో అయినా ఆమెకు ప్రాధాన్యం దక్కుతుందా.. అసలు సినిమాలో తన పాత్రకు ఏమాత్రం రోల్ ఉంది అన్నది చూడాలి.
This post was last modified on February 24, 2021 4:59 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…