పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒడుదొడుకులు ఎదుర్కొని ఉండొచ్చు. ఆయన పార్టీ గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు అందుకుని ఉండొచ్చు. పవన్ స్వయంగా రెండుచోట్ల ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఆయన రాజకీయ విధానాలు, లక్ష్యాలు, వివిధ అంశాలపై ఆయన స్పందించే తీరు కొంతమందిని బాగానే ఆకట్టుకుంటూనే ఉంటాయి.
కొంతమంది పవన్ మాటలతో ఎంతో ప్రభావితం అవుతుంటారు కూడా. దర్శకుడు చిన్ని కూడా అలాగే ప్రభావితం అయి ఓ సినిమా తీసేయడం విశేషం. ఇంతకుముందు ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో ఓ కామెడీ క్యారెక్టర్ చేసిన చిన్ని.. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’, ‘లండన్ బాబులు’ సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి నుంచి రానున్న కొత్త చిత్రం.. అక్షర. ఈ సినిమా కథ పవన్ మాటల నుంచే పుట్టిందని అతను వెల్లడించాడు.
‘అక్షర’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ కథ రాయడానికి పవన్ ఎలా స్ఫూర్తినిచ్చాడో వీడియో ద్వారా వివరించాడు చిన్ని. పవన్ కొన్ని సందర్భాల్లో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిన వీడియోలను తెరపైన ప్రదర్శించారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో, ఒత్తిడి లేకుండా చదువుకోవాలని.. అప్పుడే వారు మంచి విజ్ఞానంతో, ఉన్నతమైన వ్యక్తులుగా తయారవుతారని.. అలా కాకుండా కార్పొరేట్ కళాశాలల్లో నాలుగ్గోడల మధ్య బంధించి ఎంతసేపూ చదువు చదువు అంటూ వాళ్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ పవన్ ఈ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. మన విద్యా వ్యవస్థలో రావాల్సిన మరిన్ని మార్పుల గురించి పవన్ ఇందులో మాట్లాడాడు. ఈ ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొంది తాను ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాల నేపథ్యంలో ‘అక్షర’ కథ రాసినట్లు చిన్ని వెల్లడించాడు. ఆ రకంగా ఈ సినిమాకు స్ఫూర్తి కచ్చితంగా పవనే అని చిన్ని స్పష్టం చేశాడు.
This post was last modified on February 24, 2021 4:24 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…